Anil Kumar Eravathri Gives Strong Counter To Etela Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు మాజీ విప్ ఈరవత్రి అనిల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గురించి ఇంకోసారి మాట్లాడితే.. కాంగ్రెస్ శ్రేణులు మీ నాలుకలు కోస్తారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఈటెల ఒక అవినీతి పరుడు, ఒక స్వార్థపరుడు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లారని ఈటెల అంటున్నారని.. ఆయన ప్రజల కోసం కొట్లాడితే, ప్రభుత్వం జైలుకు పంపిందని స్పష్టతనిచ్చారు. జాన్వాడ ఫామ్ హౌస్ భూముల విషయంలో కొట్లాడితే.. రేవంత్ రెడ్డిని మంత్రి కేటీఆర్ 16 రోజులు జైల్లో వేశారని.. అప్పుడు ఈటల కూడా మంత్రివర్గంలో ఉన్నారని గుర్తు చేశారు.
RCB vs RR: ముగిసిన ఆర్సీబీ బ్యాటింగ్.. రాజస్థాన్ లక్ష్యం ఎంతో తెలుసా?
ఈటల బీసీ అని చెప్పుకుంటారని.. కానీ ఆయన పట్టాదారు పాసు పుస్తకంలో మాత్రం రాజేందర్ రెడ్డి అని ఉందని.. మరి నువ్వు రెడ్డివా, బీసీవా నువ్వే చెప్పాలని అడిగారు. ఈటల ఫైనాన్స్ మిసిస్టర్‌గా ఉన్న సమయంలోనే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో సంతకాలు పెట్టి నిధులు విడుదల చేశారని.. అలాంటప్పుడు అవినీతిలో నీ భాగస్వామ్యం లేదా? అని ఈరవత్రి అనిల్ ప్రశ్నించారు. ఉప ఎన్నికలన్నింటిలోనూ నిధులు అడ్డగోలుగా ఖర్చు చేశారని.. అవి ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. ఈటల సివిల్ సప్లై మంత్రిగా ఉన్నప్పుడు బియ్యం కుంభకోణం జరిగిందని ఆరోపించారు. మక్కల కుంభకోణంలో, ఆరోగ్య శాఖలో జరిగిన అవినీతిలో నీ వాటాలెంత? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వంలో జరిగిన అన్ని అవినీతి బాగోతాలు నీకు తెలుసు కదా.. మరి కేంద్రానికి ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నారు.
Animal: ఇదేందయ్యా.. ఇది.. సినిమా చూడాలంటే వారి పర్మిషన్ కావాలా..?
అంతకుముందు.. కేసీఆర్‌తో ఒప్పందంలో భాగంగానే ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని ఈరవత్రి అనిల్ పేర్కొన్నారు. వారిద్దరి మధ్య మంచి అవగాహన ఉందని, కాంగ్రెస్ బలం తగ్గించేందుకు వాళ్లిద్దరు కలిసి వ్యూహం పన్నారని విమర్శించారు. ఒప్పందంలో భాగంగానే హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటలపై కేసీఆర్ బలహీన వ్యక్తిని పోటీకి దించారన్నారు. కాగా.. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ రూ.25 కోట్లు ఇచ్చిందని.. ఆ రెండు పార్టీలూ ఒకటేనని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అందుకు కౌంటర్‌గానే ఈరవత్రి అనిల్ పై విధంగా స్పందించారు.