World War II Ship: రెండు ప్రపంచ యుద్ధాలు ఎంత నష్టాన్ని మిగిల్చాయే అందరికి తెలిసిందే. ప్రపంచ యుద్ధాల్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయాల పాలయ్యారు.చాలా మంది సైనికులు కనిపించకుండా పోయారు. కొని వార్ షిప్స్, ఎయిర్‌క్రాఫ్ట్‌లు కనిపించకుండా పోయాయి. రెండో ప్రపంచ యుద్ధంలో ఇదే జరిగింది. 864 మంది సైనికులతో మునిగిపోయిన రెండవ ప్రపంచ యుద్ధం నౌక 84 సంవత్సరాల తర్వాత కనుగొనబడింది. 1942 జూలైలో ఫిలిప్పీన్స్ తీరంలో ఆ ఓడ మునిగిపోయినట్లు తెలిసింది. రెండో ప్రపంచ యుద్ధంలో 864 మంది ఆస్ట్రేలియన్ సైనికులతో మునిగిపోయిన జపాన్ వాణిజ్య నౌకను దక్షిణ చైనా సముద్రంలో లోతైన సముద్ర సర్వే నిపుణులు కనుగొన్నట్లు ఇండిపెండెంట్‌లో ఓ నివేదిక ప్రకారం తెలిసింది.
Read Also: Island For Sale: అమ్మకానికి ఐలాండ్.. ధర రూ.1.5 కోట్లు మాత్రమేనట..
జూలై 1942లో ఫిలిప్పీన్స్ తీరంలో మునిగిపోయినప్పటి నుంచి తప్పిపోయిన యుద్ధ ఖైదీల రహస్య రవాణా నౌక ‘ఎస్‌ఎస్ మాంటెవీడియో మారు’ లుజోన్ ద్వీపానికి వాయువ్యంగా కనుగొనబడిందని ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ శనివారం ప్రకటించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ప్రమాదంగా రికార్డుకెక్కింది. సముద్రం మధ్యలో ఉన్న సమయంలో ఈ నౌకపై దాడి జరిగింని.. వెంటనే అది సముద్రంలో మునిగిపోయిందని ఆస్ట్రేలియా సర్కారు తెలిపింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఖైదీలు ఉన్నారా లేదా అన్నది క్లారిటీ లేదు. ప్రభుత్వం ప్రకారం, 13,123 అడుగుల కంటే ఎక్కువ లోతులో కనుగొనబడిన శిధిలాల కోసం మెరైన్ ఆర్కియాలజీ నాట్-ఫర్-ప్రాఫిట్, డీప్-సీ సర్వే నిపుణులు వేటకు నాయకత్వం వహించారు. ఈ శోధనకు ఆస్ట్రేలియా రక్షణ శాఖ కూడా సహకరించింది.ఈ విపత్తులో యుద్ధ ఖైదీలు, వివిధ దేశాల పౌరులతో సహా 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.