తెలంగాణ ప్రభుత్వం మొదటిసారి… ఆ పార్టీ నాయకులు ఇంద్రపార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేయబోతున్నారు. కేంద్రం ధాన్యం కొనాలని అధికార ప్రభుత్వ నాయకులు ధర్నా కి దిగుతున్నారు అని వీ.నుమంతరావు చెప్పారు. ధర్నా చౌక ఎత్తేశారు కదా… ఇప్పుడు అదే ధర్నా చౌక వద్ద దర్నా కి దిగుతున్నారు. ధర్నా చౌక ఎత్తేస్తే నెను కోర్ట్ లో పిటిషన్ వేశాను. రైతుల పట్ల కేసీఆర్ కి చిత్త శుద్ధి ఉంటే..నల్ల చట్టాలపై అసెంబ్లీలో తీర్మానం చెయ్ కేసీఆర్ అని చెప్పారు. అలాగే కేసీఆర్ నీలో వచ్చిన మార్పుని వెనకకి పోనివ్వకు అన్నారు. ఈ ఉద్యమం రైతుల పట్ల ఉన్నదా లేదా అన్నది స్పష్టం చేయి. హుజురాబాద్ లో ఓడిపోయిన దళిత బందు అందరకి ఇవ్వు కేసీఆర్. ప్రగతి భవన్ లో ఇప్పటికైనా ప్రజలని కలువు కేసీఆర్. ధర్నా తరువాత డిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలని కలువు కేసీఆర్. పవర్ ఉన్నపుడు ఒకటి.. లేనపుడు ఒకటి చేయడం మంచిది కాదు కేసీఆర్ అని పేర్కొన్నారు.