Yadadri: నేటి సమాజంలో ఆస్తులకు ఇచ్చే విలువ అనుబంధాలకు ఇవ్వడం లేదు. రక్త సంబంధీకుల కంటే ఆస్తిపాస్తులే ప్రధానం అవుతున్న రోజులివి. ఇప్పుడున్న బంధాలన్నీ ఆర్థిక బంధాలతోనే ముడిపడి ఉన్నయని మరోసారి రుజువైంది. తండ్రి ఆస్తి కోసం కోర్టుకెక్కిన ఇద్దరు చెల్లెళ్లు, సోదరుడి వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని, ఆ కేసును ఉపసంహరించుకుంటేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని భార్య, బంధువులు తేల్చి చెప్పారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో చోటుచేసుకుది. మూడు రోజుల క్రితం ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న హనుమంత రెడ్డి అత్యక్రియలు ఇప్పటి వరకు చేయకపోవడంపై స్థానికంగా కలకలం రేపింది. దీనికి గల కారణం ఆస్తి వివాదమనే తేలింది. ఆ కేసును విరమించుకుంటేనే అంత్యక్రియలు చేస్తానని మృతుడి భార్య భీష్మించుకుని కూర్చుంది. దీంతో మూడు రోజులుగా అంత్యక్రియలకు నోచుకోక మృతదేహం మార్చులోనే పడివుంది.
Read also: Chandrababu Naidu: ఏపీ రాజధానిగా అమరావతే.. ఆర్థిక రాజధానిగా విశాఖ..!
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగికి చెందిన చీరిక హనుమంత రెడ్డి హైదరాబాద్‌లో ప్రైవేట్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తూ… అక్కడే అద్దె ఇంట్లో ఉంటున్నాడు. హనుమంతరెడ్డి తండ్రి నర్సిరెడ్డికి 7.24 ఎకరాల భూమి ఉంది. పోస్ట్ మాస్టర్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన నర్సిరెడ్డి వ్యక్తిగత కారణాలతో మూడేళ్ల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి ఆస్తిలో వాటా కావాలని హనుమంత రెడ్డి తోబుట్టువులు కోర్టును ఆశ్రయించారు. హనుమంత రెడ్డికి అతని తమ్ముడు కరుణాకర్ రెడ్డితో ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా మానసిక వేదనకు గురైన హనుమంత రెడ్డి శనివారం రాత్రి పంతంగిలోని తన ఇంటికి వచ్చి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం ఇరుగుపొరుగు వారు చూసి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Read also: NBK 109 : సెట్ లో బాలయ్య, నేను సరదాగా ప్రాంక్ చేస్తుంటాం : చాందిని చౌదరి
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే తన భర్త మృతికి ఆడపడుచులు, మరిదే కారణమని హనుమంతరెడ్డి భార్య స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ముగ్గురిపై కేసు నమోదు చేశారు. దీంతో భయపడిన ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడు గ్రామ పెద్దలు, బంధువుల ద్వారా హనుమంతరెడ్డి భార్యపై కేసు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చారు. ఆస్తిపై కోర్టులో ఉన్న కేసు ఉపసంహరించుకుంటేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని హనుమంతరెడ్డి భార్య స్వప్న, బంధువులు బెదిరించారు. ఆదివారం, సోమవారాల్లో అతని సోదరుడు, సోదరితో బంధువులు చర్చించారు. కేసు ఉపసంహరణకు అంగీకరించినా.. సోమవారంతో కోర్టు సమయం ముగియడంతో అది సాధ్యం కాలేదు. మంగళవారం కేసు ఉపసంహరించుకోవడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Chandrababu Naidu: ఏపీ రాజధానిగా అమరావతే.. ఆర్థిక రాజధానిగా విశాఖ..!