ఎన్డీయే కూటమికి శాసన సభాపక్ష నేతగా ఎన్నికైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. కూటమి అద్భుత విజయం సాధించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన విజయం అని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని 2021లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం, తగ్గాము, నిలబడ్డామన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పుడు సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు కావాలి.. చంద్రబాబు అనుభవం, నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరం.. ఎన్డీయే కూటమి శాసనసభ పక్షానేతగా చంద్రబాబు పేరు ప్రతిపాదించి బలపరిచినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
Read Also: Gold Rate Today: మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!
సమిష్టిగా పోరాటం చేసి అద్భుతమైన మెజార్టీతో ఈరోజు ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎన్డీయే కూటమి విజయం దేశవ్యాప్తంగా అందరికి స్పూర్తిని ఇచ్చిందన్నారు. ఏపీ ప్రజలు మనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజల నమ్మకాన్ని పెంచాం.. అందుకే, కక్ష సాధింపులకు ఇది సమయం కాదు.. అలాగే, చంద్రబాబు నాలుగు దశాబ్దాల అనుభవం కలిగిన నాయకుడు అంటూ పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
Read Also: Ram Pothineni : ఆ యంగ్ డైరెక్టర్ తో మూవీ ప్లాన్ చేస్తున్న రామ్..?
ఇక, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించేందుకు ప్రజలు కసిగా ఓట్లేశారు.. విజయం నుంచీ పాఠాలు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.. మూడు పార్టీల లక్ష్యం ప్రజా సంక్షేమమే అని చెప్పుకొచ్చారు. 3 పార్టీల కలయిక త్రివేణి సంగమం లాంటిది.. సభా నాయకుడిగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రతిపాదనను నేను సమర్ధిస్తున్నానున అంటూ పురంధేశ్వరి తెలిపారు.