Chandrababu: ఎన్డీయే శాసన సభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబు నాయుడు.. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారు.. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అత్యున్నత ఆశయాల కోసం 3 పార్టీలు ఏకమయ్యాయని ఆయన తెలిపారు. ప్రజలు గెలిచారు, ఇక రాష్ట్రం నిలబెట్టాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది.. 3 పార్టీలు నూటికి నూరు శాతం పరస్పరం సహకరించుకోవటం వల్లే ఈ విజయం సాధ్యమైంది.. 93 శాతం గెలుపు సాధించటం దేశ చరిత్రలో అరుదైన ఘట్టం.. 57 శాతం ప్రజలు మనకు ఓట్లు వేసినందున మరింత బాధ్యతగా వ్యవహరించాలి అని చంద్రబాబు అన్నారు.
Read Also: AP: ఎమ్మెల్యేలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కీలక సమావేశం..
అలాగే, అమరావతి మన రాష్ట్ర రాజధాని, విశాఖను ఆర్ధిక రాజధానిగా అభివృద్ధి చేద్దాం అని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రజా వేదికలా విధ్వంస రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలి.. విశాఖ అభివృద్ధి మాత్రం మేం మర్చిపోం.. విశాఖ న్యాయ రాజధాని అంటూ చేసిన మోసాన్ని ప్రజలు గ్రహించారు.. కర్నూలు అభివృద్ధికి మనం కట్టుబడి ఉన్నాం.. సీఎం కూడా మామూలు మనిషే.. సీఎం వస్తున్నాడు అంటే ఇక పరదాలు కట్టటం, దుకాణాలు బంద్ చేయటం, ట్రాఫిక్ నిలిపి వేయటం, చెట్లు నరకటం లాంటివి ఇకపై ఉండదు అని ఆయన చెప్పుకొచ్చారు. నా కాన్వాయ్ ఒక నిమిషం ఆలస్యమైనా పర్లేదు కానీ ట్రాఫిక్ నిబంధనలు పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు అని చంద్రబాబు వెల్లడించారు.
Read Also: Ram Pothineni : ఆ యంగ్ డైరెక్టర్ తో మూవీ ప్లాన్ చేస్తున్న రామ్..?
కాగా, జనసేన 21 సీట్లు తీసుకుని 21 సీట్లు గెలిచిందని చంద్రబాబు అన్నారు. బీజేపీ 10 సీట్లు తీసుకుని 8 గెలవడం మామూలు విషయం కాదు.. జైలులో నన్ను కలిశాక పొత్తు ప్రకటన తొలుత పవన్ కళ్యాణ్ చేశారు.. ఆ రోజు నుంచి ఎలాంటి పొరపచ్ఛాలు లేకుండా మూడు పార్టీలు కలిసేలా పవన్ వ్యవహరించారు.. అధినేతలు కలిసి ప్రచారం చేయటం క్షేత్రస్థాయిలో ఓట్ల బదిలీకి మార్గం సుగమమైంది అని ఆయన చెప్పుకొచ్చారు. రేపనేదే లేదనట్లు గత ప్రభుత్వం అహంకారంతో ప్రవర్తించిన తీరు అందరికీ కేస్ స్టడీ.. తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షిద్దాం కానీ కక్ష, ప్రతీకారాలు మనకొద్దు అని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు తెలిపారు.
Read Also: CM Revanth Reddy: సర్కారు ఆఫీసుల్లో బయోమెట్రిక్..? సెక్రటేరియట్ నుంచే శ్రీకారం..!
ఇక, అందరి సహకారంతో రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అని చంద్రబాబు చెప్పారు. రేపు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీ సహా వివిధ ఎన్డీయే పక్షాల నేతలు వస్తున్నారు.. రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటు ఇచ్చేందుకు మోడీ, అమిత్ షా అంగీకరించారు.. మనకు లభించింది విజయం కాదు, ప్రజలకు సేవ చేసే బాధ్యత.. పేద ప్రజల జీవితాలు మార్చే దిశగా కృషి చేసి వారికి మనపై ఉన్న నమ్మకాన్ని కాపాడుకుందాం.. శిథిలమైన రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టుకుందాం అని టీడీపీ అధినేత వెల్లడించారు.