తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవ వేడుకలు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా అట్టహాసంగా జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి టీఆర్‌ఎస్ శ్రేణులు తరలి వచ్చారు. అయితే టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్ నాయకులు మినహా మరొకరులో లోపలికి వెళ్లేందుకు అనుమతించడం లేదు. టీఆర్‌ఎస్ నాయకులకు మాత్రమే ప్రత్యేకమైన బార్ కోడ్ కలిగిన పాస్‌లను జారీ చేశారు. ఈ హైటెక్ పాసులు ఉంటేనే సమావేశం లోపలికి ఎంట్రీ.. లేకుంటే ఎంతటి వారికైనా.. నో ఎంట్రీ అని చెబుతున్నారు.
ఇంతకు ఈ హైటెక్ పాసుల గోల ఎంటీ.. అని అడగగా.. గత ప్లీనరీలో ఎవరెవరు సమావేశానికి హజరయ్యారని తెలుసుకునేందుకు రిజిస్ట్రార్ పెట్టి, సంతకం పెట్టించుకున్నాం.. కానీ దానివల్ల చాలా ఆలస్యంతో పాటు.. కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడిందని, ఇప్పుడు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనల మేరకు ఈ బార్ కోడ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసినట్లు టీఆర్‌ఎస్ నేత క్రిషాంక్ తెలిపారు. అంతేకాకుండా బార్ కోడ్ స్కాన్ చేసిన సెంకడ్లలోనే ఆ బార్ కోడ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు డేటాబేస్‌లోకి వచ్చేస్తాయని, మంత్రులు, వీఐపీలు నుంచి జడ్పీటీసీల వరకు ఈ బార్ కోడ్ పాస్‌లను జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.