krishank Manne: హైదరాబాద్ కంచె గచ్చిబౌలి ప్రాంతంలోని భూ వివాదంతో పాటు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) అంశంపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేసిన బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూములపై AI ఆధారంగా తప్పుడు పోస్టులు చేశారనే అభియోగంతో ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ నెల 9, 10, 11 తేదీలలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు విచారణకు హాజరుకావాలని…
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవ వేడుకలు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా అట్టహాసంగా జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి టీఆర్‌ఎస్ శ్రేణులు తరలి వచ్చారు. అయితే టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్ నాయకులు మినహా మరొకరులో లోపలికి వెళ్లేందుకు అనుమతించడం లేదు. టీఆర్‌ఎస్ నాయకులకు మాత్రమే ప్రత్యేకమైన బార్ కోడ్ కలిగిన పాస్‌లను జారీ చేశారు. ఈ హైటెక్ పాసులు ఉంటేనే సమావేశం లోపలికి ఎంట్రీ.. లేకుంటే ఎంతటి వారికైనా..…
అక్కడ అధికారపార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారో లేదో తెలియదు. కానీ.. మూడు కార్పొరేషన్ల ఛైర్మన్లు మాత్రం ఏవేవో లెక్కలు వేసుకుని టికెట్ కోసం ట్రయిల్స్ మొదలుపెట్టేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న నియోజకవర్గం కావడంతో అధికారపార్టీ నేతల ఎత్తుగడలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కంటోన్మెంట్ టీఆర్ఎస్ రాజకీయాల్లో మలుపులు ఉంటాయా?గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కంటోన్మెంట్ ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్. ఇక్కడ ఎమ్మెల్యే సాయన్న టీఆర్‌ఎస్సే.…