మున్నూరు రవికి ప్లీనర్ ఎంట్రీ పాస్ ఎవరు ఇచ్చారు? మున్నూరు రవి. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర చేసిన కేసులో కీలక నిందితుడు. అలాంటి వ్యక్తి టీఆర్‌ఎస్ ప్లీనరీలో ప్రత్యక్షమయ్యాడు. టీఆర్ఎస్ పార్టీ పండక్కి వెళ్లాలని ఎంతోమంది గులాబీ కార్యకర్తలు ప్రయత్నించినా.. నియోజకవర్గాల నుంచి కొందరినే ఎంపిక చేశారు. వారికే ఆహ్వానాలు వెళ్లాయి. ఎమ్మెల్యేలు పంపిన జాబితాను వడపోసి.. లిమిటెడ్‌గానే ఇన్విటేషన్లు పంపారు నేతలు. ప్లీనరీకి వచ్చేవాళ్లకు బార్‌కోడ్‌తో కూడిన పాస్‌లు ఇచ్చారు. ప్లీనరీ ప్రాంగణంతోపాటు.. ప్లీనరీ…
టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్‌లో టీఆర్ఎస్ నేతలు పలుచోట్ల భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ప్రధాన రహదారులపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని గతంలో జీహెచ్‌ఎంసీ అధికారులు నిబంధనలు విధించారు. దీంతో ఏ పార్టీ నేతలు ఫ్లెక్సీలు పెట్టినా ఊరుకోవడం లేదు. తాజాగా అధికార పార్టీ నేతలే భారీగా ఫ్లెక్సీలు పెట్టడంతో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి టీఆర్ఎస్ నేతలకు జరిమానాలు విధించారు. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శికి రూ.65వేలు, మంత్రి…
టీఆర్ఎస్ సుపంపన్నమైన పార్టీగా ప్రకటించారు గులాబీ దళపతి కేసీఆర్.. 60 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ మనది… నేను ఒక పిలుపిస్తే ఒక్కో కార్యకర్త వెయ్యి రూపాయలు ఇస్తే అదే రూ.600 కోట్లు అవుతుందన్నారు.. టీఆర్ఎస్ ప్లీనరీలో మాట్లాడిన కేసీఆర్.. విదేశాలకు పార్టీ ప్రతినిధులను పార్టీ స్వంత ఖర్చుతో పంపిస్తామని.. రూ.451 కోట్ల బ్యాంక్ ఎఫ్‌డీలు ఉన్నాయన్నారు.. రూ.861 కోట్లు టీఆర్ఎస్ కలిగి ఉందన్న ఆయన.. రూ.3.84 కోట్లు ప్రతీ నెలా వడ్డీ రూపంలో పార్టీ ఖాతాలో…
హైదరాబాద్‌లో అత్యంత భద్రత నడుమ జరుగుతోన్న టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీలో ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు.. ప్లీనరీలో ప్రత్యక్షమయ్యాడు మున్నూరు రవి.. అయితే, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న రవి… ప్లీనరీలో కనిపించడం చర్చగా మారింది.. మరోవైపు, హై సెక్యూరిటీ, బార్ కోడ్ పాసులు ఇచ్చినా.. ఎలా మున్నూరు రవి ప్లీనరీకి వచ్చారని అరా తీశారు పార్టీ శ్రేణులు.. కానీ, ఐడెంటిటీ కార్డ్ తోనే ప్లీనరీ హాల్‌లోకి ప్రవేశించినట్టుగా తెలుస్తోంది. అక్కడ కొందరు…
హైదారాబాద్ మాదాపూర్‌లోని హెచ్ఐసీసీ వేదికగా టీఆర్‌ఎస్ 21వ ప్లీనరీ సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ప్లీనరీ సమావేశాల్లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందించే తీర్మానాన్ని మంత్రి ప్రవేశపెట్టారు. దీనికి మంత్రి గంగుల కమలాకర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న కేంద్రం..…
హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో టీఆర్‌ఎస్ 21వ ప్లీనరీ సమావేశాలు ఘనంగా జరుగుతున్నాయి. 2 దశబ్దాలు కలిగిన టీఆర్‌ఎస్ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అయితే ప్లీనరీ సమావేశాల్లో భాగంగా.. బాల్క సుమన్ మాట్లాడుతూ.. దేశంలో అత్యంత వెనుబడిన జాతి దళిత జాతి అని, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్యాయానికి గురైన జాతి దళిత జాతి అన ఆయన అన్నారు. ఈ దళిత జాతికి సంబంధించి గుర్రం జాషువా గబ్బిలం కావ్యంలో ‘భారతావని దళితజాతికి బాకీ…
టీఆర్ఎస్ 21వ ఆవిర్భవ వేడుకలు ఘనంగా జరుతున్నాయి. అందరూ ఊహించిన విధంగానే టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు చెప్పకనే చెప్పారు. అయితే టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాల్లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మాటల్లో అచ్చే దిన్ అని.. కానీ.. చేతల్లో సచ్చే దిన్‌గా వ్యవహరిస్తోందన్నారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం.. రాష్ట్రంలో బలహీన ప్రభుత్వం ఉండాలన్నదే కేంద్ర ప్రభుత్వం ఆలోచన అని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఆ ఆలోచనలో భాగంగానే చిన్న…
టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు మాదాపూర్‌లోని హెచ్ఐసీసీ వేదికగా జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్ 21వ ఆవిర్భవ వేడుకల్లో భాగంగా పలు కీలక తీర్మాణాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సమావేశాల్లో మాట్లాడుతూ.. ఈ రోజు దేశంలో జరుగుతున్నటువంటి మత విద్వేషాలు మంచిదా అని ఆయన ప్రశ్నించారు. కుటిల రాజకీయం, పచ్చి రాజకీయ లబ్దితోని, పది మంది పదవుల కోసం విధ్వంసం చేయడం తేలికనే.. కానీ.. నిర్మాణం చేయాలంటే చాలా సమయం పడుతుందన్నారు. ఎవరు అవునన్నా.. కాదన్నా.. కర్ణాటక రాష్ట్రంలో…
తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భవ వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్ పార్టీ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలను కేసీఆర్ వివరించారు. అంతేకాకుండా స్వరాష్ట్రం సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్ పార్టీ.. స్వరాష్ట్ర సాధన తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి చెప్పుకొచ్చారు. అయితే పథకాల్లో అగ్రస్థానంలో ఉన్న దళిత బంధు గురించి పలు కీలక విషయాలను సీఎం కేసీఆర్ వెల్లడించారు. దళిత బంధులో మూడు పార్వ్శలు…
టీఆర్ఎస్ 21వ ప్లీనరీ సమావేశాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్లీనరీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. జాతీయ రాజకీయాల్లోకి టీఆర్ఎస్ పార్టీ పోతుందని స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లో నెలకొన్ని సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు వెళ్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సాధ్యమైన అభివృద్ధి, దేశవ్యాప్తంగా వ్యాప్తి చేస్తామన్నారు. అందుబాటులో ఉన్న విద్యుత్, జలాలను కూడా దేశం వాడుకోలేకపోతోందని, ఇది ఎవరి ఆసమర్థత అని ప్రశ్నించారు. అంతేకాకుండా ఓ రాష్ట్రంలో ఇప్పడిప్పుడే రాత్రి పూట కూడా అన్నం తింటున్నామంటుంటే..…