TPCC Mahesh Goud : టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నేతలకు శుభవార్త చెప్పారు. ఈ నెలాఖరులోగా కార్పొరేషన్ చైర్మన్లు, మిగిలిన చైర్మన్ పదవులు, బోర్డు పదవుల భర్తీ ప్రక్రియను పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో చిట్‌చాట్ లో మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ఘన విజయం సాధించిందని తెలిపారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి దేశ, విదేశాల నుంచి భారీగా పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్, దూరదృష్టికి గ్లోబల్ సమ్మిట్ నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. సమ్మిట్ విజయంపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు వచ్చాయో చెప్పాలని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్‌ను చూసి హరీష్ రావుకు గుబులు పట్టిందని విమర్శించారు. దావోస్ సమ్మిట్ వలన దాదాపు లక్ష 70 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు. ఫోర్త్ సిటీ చారిత్రాత్మక నిర్ణయమని, ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ రెండూ ఒకటేనని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. అన్ని రంగాలకు కేంద్రంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు. ఫ్యూచర్ సిటీతో దేశం చూపు తెలంగాణ వైపే మళ్లిందని అన్నారు.
Dandruff Remedies: డ్యాండ్రఫ్ జాడ మాయం చేసే 5 నేచురల్ టిప్స్ ఇవే..
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమం ఎజెండాగా ప్రజాపాలన కొనసాగుతోందని తెలిపారు. మెట్రో ఫేజ్ విస్తరణతో పాటు మూసీ నది సుందరీకరణ వంటి కీలక పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో పార్టీ కార్యాలయం కోసం స్థలం కేటాయించే అంశంపైనా చర్చ జరుగుతోందన్నారు. రాష్ట్ర ఉద్యోగులపై హరీష్ రావు తన స్పష్టమైన నిర్ణయం వెల్లడించాలని డిమాండ్ చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో విధ్వంసం పాలైందని ఆరోపించారు. తెలంగాణ భవిష్యత్తుకు గ్లోబల్ సమ్మిట్ ఒక సరికొత్త దశను తీసుకొచ్చిందని అన్నారు.
కవిత వ్యాఖ్యల వల్లే బీఆర్ఎస్ నేతల లూటీలు బయటకు వస్తున్నాయని, ఆమె లూటీ ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గ్రామ సర్పంచ్‌ల ఏకగ్రీవ ఎన్నిక సాధించడం సాధారణ విషయం కాదని, అందుకు ప్రభుత్వ విధానాలే కారణమని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులు ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. గతంలో తాను 50 ఎకరాల భూమిని భూదానంగా ఇచ్చానని ఈ సందర్భంగా మహేష్ గౌడ్ గుర్తు చేశారు.
Tilak Varma Record: తొలి భారత బ్యాట్స్‌మన్‌గా తిలక్ వర్మ రేర్ రికార్డు!