Telangana Rising Global Summit : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ స్టాళ్లు, కార్పొరేట్ కంపెనీల స్టాళ్లను నేడు (గురువారం) పెద్ద ఎత్తున సాధారణ ప్రజలు, విద్యార్థినీ, విద్యార్థులు సందర్శించారు. ఉదయం నుండే పెద్ద సంఖ్యలో ఈ స్టాళ్లను దర్శించడానికి బారులు తీరారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు కార్యక్రమాలు “డిస్కవర్ తెలంగాణ: కల్చరల్ హెరిటేజ్ అండ్ నెక్స్ట్–జెన్ టూరిజం” అనే అద్భుతమైన…
ఫ్యూఛర్ సిటీ... దేశంలోని నగరాలతోకాదు.. ప్రపంచ నగరాలతో పోటీ పడేవిధంగా తీర్చిదిద్దేలనే లక్ష్యంతో దార్శనిక ప్రణాళిక రెడీ అయింది. టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కిస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిశ్రమలు, సాంకేతిక, అంతరిక్ష, వైమానిక, రక్షణ, పర్యాటక, సెమీకండక్లర్ల పరిశ్రమలను స్థాపించ బోతున్నారు. ఇందుకు సంబంధించి పారిశ్రామిక దిగ్గజాలకు ప్రోత్సాహాలను అందించి.. పెట్టుబడులు సాధించారు.
TPCC Mahesh Goud : టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నేతలకు శుభవార్త చెప్పారు. ఈ నెలాఖరులోగా కార్పొరేషన్ చైర్మన్లు, మిగిలిన చైర్మన్ పదవులు, బోర్డు పదవుల భర్తీ ప్రక్రియను పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో చిట్‌చాట్ లో మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ఘన విజయం సాధించిందని తెలిపారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి దేశ, విదేశాల నుంచి భారీగా పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు.…
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. రాష్ట్ర ప్రగతికి, పెట్టుబడుల ఆకర్షణకు అత్యంత కీలకంగా భావిస్తున్న తెలంగాణ ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ (డిసెంబర్ 8, 9) కు ప్రముఖ నేతలను ఆహ్వానించేందుకు సీఎం, డిప్యూటీ సీఎంలు నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి…
Bhatti Vikramarka : ప్రజా భవన్‌లో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ వార్ రూమ్’ ను మంగళవారం డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సందర్శించారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి రోడ్‌మ్యాప్ రూపుదిద్దుకునే ఈ కీలక కేంద్రంలో జరుగుతున్న కార్యక్రమాలను ఆయన సమగ్రంగా పరిశీలించారు. విజన్ డాక్యుమెంట్ రూపకల్పన పురోగతితో పాటు ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై భట్టి విక్రమార్క వివరంగా…
డిసెంబర్ 8, 9వ తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహేశ్వరం, మిర్ఖాన్ పేటలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి పోలీసుశాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య భారీ బందోబస్త్ కల్పిస్తోంది. ఈరోజు మహేశ్వరంలో బందోబస్త్ మీద రాచకొండ సిపి సుధీర్ బాబు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, టీజీ ICC ఏండి శశాంక్ మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి ట్రాఫిక్ డీసీపీలతో కలిసి…
డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ ఏరియాలో నిర్వహించే రెండు రోజుల వేడుకలను రెండేండ్ల విజయోత్సవాలుగా జరపాలని సూచించారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి సీఎంవో అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్తో సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రితో పాటు సీఎంవో…
Bhatti Vikramarka : తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తదుపరి నిర్వహించనున్న భారత సమ్మిట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమ్మిట్‌లో శాంతి, అహింస, ఆర్థికం, సమానత్వం వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయని వివరించారు. ఈ అంశాలు కాంగ్రెస్ పార్టీ యొక్క మూలవిధానాలకు అనుగుణంగా ఉంటాయని ఆయన తెలిపారు. భారత్ సమ్మిట్‌ని కాంగ్రెస్ పార్టీ యొక్క మూలవిధానాలను ప్రతిబింబిస్తూ నిర్వహిస్తున్నామని, ఇందులో వివిధ దేశాలకు చెందిన నాయకులు, మేధావులు,…