Tirupathi: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ పెద్ద షాక్ ఇచ్చింది. ఇక నుంచి హైదరాబాద్-తిరుపతి రూట్లలో డైనమిక్ టికెట్ ధరల విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ విధానం వల్ల ప్రయాణికుల డిమాండ్, సీట్ల ఆక్యుపెన్సీ, టికెట్ బుకింగ్ ధరలు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. దీని కోసం ప్రయాణికులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. విజయవాడ, బెంగళూరుతో పాటు పలు రూట్లలో ఇప్పటికే డైనమిక్ టికెటింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న టీఎస్‌ఆర్టీసీ.. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్-తిరుపతి మధ్య నడిచే బస్సుల్లో డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో తిరుపతి వెళ్లే బస్సుల్లో టిక్కెట్ చార్జీలు మరింత పెరగనున్నాయి. హైదరాబాద్ నుంచి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో శ్రీవారి భక్తులు తిరుమలకు వస్తుంటారు. దీంతో ఈ మార్గంలో వెళ్లే బస్సులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ మార్గాల్లో ప్రయాణీకుల డిమాండ్ సాధారణంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి టిక్కెట్ ధరలు పెరుగుతాయి.
Read also: Telangana : ఓర్నీ.. డబ్బులు, నగలతో పాటు టమోటాలు చోరీ..
హైదరాబాద్-తిరుపతి మధ్య నడిచే TSRTC సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రస్తుతం రూ.1,060 ధర ఉంది. రాజధాని ఏసీ సెమీ స్లీపర్ బస్సులకు రూ.1,340, లహరి ఏసీ స్లీపర్ బస్సులకు రూ.2,150, గరుడ ప్లస్ బస్సులకు రూ.1,580 టిక్కెట్ ధర. డైనమిక్ ప్రైసింగ్ సిస్టమ్ అమలుతో ఈ రూట్లలో తిరిగే బస్సుల ఛార్జీలు 25 శాతం పెరగనున్నాయి. ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు ఈ తరహా విధానాన్ని ఎప్పటి నుంచో అమలు చేస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో టిక్కెట్ ఛార్జీలు భారీగా పెంచుతారు. ఇప్పుడు ఆర్టీసీ కూడా ఈ విధానాన్ని అమలు చేయడంతో ప్రయాణికుల జేబులకు చిల్లు పడనుంది. విజయవాడ, బెంగళూరు రూట్లలో డైనమిక్ ప్రైసింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీసీ ఆదాయం సగటున 15 శాతం పెరిగింది. దీంతో ప్రస్తుతం తిరుపతి వెళ్లే బస్సులను తీసుకురాగా, రానున్న రోజుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే మరిన్ని రూట్లలో అమలు చేయనున్నారు. సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంస్కరణలు తీసుకొస్తున్నారు. ప్రయివేటు బస్సుల యాజమాన్యాలకు పోటీగా ప్రయాణికులను ఆకర్షించేందుకు రాయితీలు ప్రకటిస్తున్నారు. అలాగే పండుగల సమయంలో ప్రత్యేక బస్సుల సంఖ్యను పెంచడం వల్ల భారీగా ఆదాయం సమకూరుతుంది. దీంతో పాటు పలు రూట్లలో కొత్త స్లీపర్ బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి.
Nothing Phone 2 Launch: మార్కెట్‌లోకి నథింగ్ ఫోన్ 2.. ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ! ధర ఎంతంటే?