తిరుపతి రూరల్ (మం) ఓటేరులో దారుణం వెలుగుచూసింది. పశువుల చోరీకి పాల్పడ్డారు దుండగులు. అర్థరాత్రి వేళ రెండు ఆవులను కారులో ఎత్తుకెళ్లారు. తల్లి ఆవుల కోసం కారును కొంతదూరం వెంబడించాయి దూడలు. సీసీ కెమెరా ఫుటేజ్ లో చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు సూర్యకిరణ్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాత్రి సమయంలో పశువులను దొంగలిస్తున్న నలుగురు ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. Also Read:Meat Shops Closed:…
Minister Anagani: స్వర్ణాంధ్ర విజన్- 2047లో భాగంగా డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్(DVAPU) పీ4 కార్యక్రమంపై జరిగిన సమావేశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్-1 గా ఉండేలా సీఎం చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ కు రూపకల్పన చేశాడని తెలిపారు.
తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం నరసింగాపురంలో జరిగిన ఒక ఘటన సినిమా కథను తలపిస్తోంది. ఇటీవల రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకున్న ‘కోర్టు’ సినిమాను పోలి ఉన్న ఈ ఘటన చర్చనీయాంశం అయింది. అసలు విషయం ఏమిటంటే మిట్టపాళెం ఎస్సీ కాలనీకి చెందిన అజయ్ అనే యువకుడిని ప్రేమించిన 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత మరణం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ ఘటనలో పరువు హత్య జరిగిందా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు…
Tirumala Rush: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. దీంతో తిరుమలలో 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకేన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుంది.
Tirumala: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఆ తిరుమల తిరుపతి కొండపై భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగి పోయింది. శ్రీవారి దర్శనం కోసం 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
Tirumala Laddu: ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ తిరుమల శ్రీవారి భక్తులకు ప్రసాదంగా అందించే లడ్డూల రుచి, వాసన త్వరలో మారనున్నాయి. ఇప్పుడు ఈ లడ్డూలను కర్ణాటకలోని నందిని నెయ్యితో తయారు చేయలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తో టీటీడీ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ఏకంగా 350 టన్నుల నెయ్యి కోసం ఈ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం తర్వాత ఫెడరేషన్ కూడా నెయ్యి సరఫరా చేయడం మొదలు పెట్టింది. లడ్డూ లలో…
Tirumala Rush: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వ దర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు నిండి బయట టీబీసీ వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) అధికారులు పేర్కొన్నారు.
USA Gun Shooting: అమెరికాలో ప్రవాస తెలుగు వైద్యుడు పేరంశెట్టి రమేశ్‌బాబును శుక్రవారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరుకు చెందిన రమేశ్ బాబు తుపాకీ కాల్పుల్లో మరణించినట్లు తెలిపారు.