బీజేపీ చరిత్ర మార్చే కుట్ర చేస్తుంది: జగ్గారెడ్డి

బీజేపీ పై మరోసారి కాంగ్రెస్ సీనియర్‌ నేత జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పై ధ్వజమెత్తారు. బీజేపీ పై ప్రశ్నల వర్షం కురిపించారు. నల్లదనం తెచ్చి పేదల అకౌంట్లలో 15 లక్షలు వేస్తా అన్నారు. ఏమైంది…? తెలంగాణకి వస్తున్న బీజేపీ ముఖ్యమంత్రలు 15 లక్షల ప్రస్తావన ఎందుకు తేవడం లేదు..? బీజేపీ చరిత్ర మార్చే కుట్ర చేస్తుంది తప్పితే చేసింది ఏం లేదని విమర్శించారు. బీజేపీ నాయకులు మాట మీద నిలబడే మనుషులు కాదంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఏం చేసింది అంటుంది… కాంగ్రెస్ చేసినప్పుడు మోడీ పుట్టలేదలేని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

Read Also: ఏపీ ప్రభుత్వానికి విర్కో గ్రూప్‌ కంపెనీ భారీ విరాళం

వల్లభాయ్‌ పటేల్‌ ..సుభాష్‌ చంద్రబోస్‌.. కాంగ్రెస్‌ వాళ్లే అన్న విషయాన్ని బీజేపీ నేతలు గుర్తుపెట్టుకుంటే మంచిదన్నారు. బీజేపీ ఇప్పుడు వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టి వల్లభాయ్‌ పటేల్‌ను మేమే గుర్తించామంటూ డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. స్వాతంత్య్రం తెచ్చింది.. కాంగ్రెస్.. సమస్యలు తీర్చింది కాంగ్రెస్… సమస్యలు సృష్టించేది బీజేపీ అంటూ మండిపడ్డారు. బీజేపీకి అసలు విలువలు ఉన్నాయా..? కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూల్చి గద్దె నెక్కింది బీజేపీ కాదా..? అంటూ నిప్పులు చెరిగారు. బీజేపీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నది.. ఏమైంది..? అంటూ ప్రశ్నించారు. వరి కొనుగోలు సమస్య తెచ్చింది బీజేపీ కాదా.. విచిత్ర ఉద్యమాలు చేస్తోంది బీజేపీ అంటూ జగ్గారెడ్డి బీజేపీపై విరుచుకుపడ్డారు. 2023లో కేసీఆర్‌ ఎన్నికలకు పోయే అవకాశం ఉండోచ్చు అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

Related Articles

Latest Articles