ఈరోజు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసారు. చంద్రబాబుకు రాజీనామా లేఖ పంపిన ఎల్.రమణ మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు టీఆర్ఎస్‌లో చేరుతున్నా అని పేర్కొన ఆయన రాష్ట్రప్రగతిలో భాగసౌమ్యం కావాలని అనుకుంటున్నాను అన్నారు. అయితే గత కొన్ని రోజులుగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ నిన్నవెళ్లి సీఎం కేసీఆర్ ను కలిసిన ఎల్.రమణ ఈరోజు ఆ తెరాసలో చేరిపోయారు.