ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. ఈ నెల 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఏపీ మాజీ ముఖ్యమంత్రిని పోలీసులు భారీ భద్రత నడుమ రోడ్డుమార్గంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
Off The Record: కడప పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడిగా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఎం. లింగారెడ్డి ఉన్నారు. వచ్చే మార్చి నాటికి ఆయన జిల్లా అధ్యక్ష పదవి చేపట్టి రెండేళ్లు పూర్తవుతుంది. 2024లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో పార్టీ జిల్లా పగ్గాలు మరొకరికి ఇవ్వాలనే ఆలోచనలో టీడీపీ అధిష్ఠానం ఉందట. అయితే ఎవరిని ఆ హాట్ సీటులో కూర్చోబెట్టాలో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారట. నియోజకవర్గాల వారీగా ఇంఛార్జుల నుంచి అభిప్రాయ సేకరణ చేసిన సమయంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం…
ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయిలో తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి.." కార్యక్రమం ప్రారంభిస్తామని టీడీపీ అంటే లండన్ బాబు దెందులూరులో హడావిడి చేశారన్నారు.
చంద్రబాబు కు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపించే ప్రయత్నం చేస్తున్నారు అని ఇరిగేషన్ శాఖ మంత్రి అనీల్ కుమార్ అన్నారు. అందుకే ఇవాళ కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. 14 ఏళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. 144 సంవత్సరాల్లో సోమశిల కు ఈ స్థాయి వరద రాలేదు. అన్నమయ్య ప్రాజెక్టు స్పిల్ వే క్యపాసిటీ 2 లక్షల 17 వేల క్యూసెక్కులు… కానీ ఆ రోజు ఉదయం…
అసెంబ్లీలో నన్ను ఎగతాళి చేశారు.. అవమానాలకు గురి చేశారు.. అయినా భరించాను. చివరకు కుటుంబ సభ్యులను కూడా దూషించారు.. గౌరవాన్ని దెబ్బతీశారు అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ అని మళ్లీ సీఎంగా వస్తానని సవాల్ విసిరి వచ్చేశాను. నేను సీఎంగా ఉన్నాను.. ప్రతిపక్ష నేతగా పని చేశాను. నేనూ మనిషినే.. భార్యకు భర్తనే. నేనెప్పుడూ ఇంట్లో ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగలేదు. ప్రజల ఎప్పుడో కట్టుకున్న ఇళ్లకు డాక్యుమెంట్లు…
టీడీపీ అధికారానికి దూరమై దాదాపు రెండున్నేళ్లు కావస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీకి కేవలం 23 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ పార్టీలో ఎంతమంది ఉన్నారనేది మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. ఇదిలా ఉంటే.. ఆపార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు మాత్రం విమర్శలకు తావిస్తోంది. ప్రతిపక్షంలో ఉంటూ ప్రజా సమస్యలపై గళం విప్పాల్సిన నేతలంతా మిన్నకుండిపోతున్నారు. దీనికితోడు సొంత పార్టీపైనే బహిరంగంగా విమర్శలు చేస్తూ అభాసు పాలవుతున్నారు. కొద్దిరోజులుగా టీడీపీలోని కొందరు సీనియర్లు అధినేతపై ధిక్కార స్వరాన్ని విన్పిస్తుండటం…
ఈరోజు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసారు. చంద్రబాబుకు రాజీనామా లేఖ పంపిన ఎల్.రమణ మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు టీఆర్ఎస్‌లో చేరుతున్నా అని పేర్కొన ఆయన రాష్ట్రప్రగతిలో భాగసౌమ్యం కావాలని అనుకుంటున్నాను అన్నారు. అయితే గత కొన్ని రోజులుగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ నిన్నవెళ్లి సీఎం కేసీఆర్ ను…