Komatireddy Venkat Reddy : సెప్టెంబర్ 10 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్
- రెండు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధత
- బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లు అసెంబ్లీలో చర్చలో
- ఓటర్ల జాబితా విడుదలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు
- హైకోర్టు ఆదేశాల మధ్య గ్రామీణాభివృద్ధి నిధుల కోసం కీలకమైన ఎన్నికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy : తెలంగాణలో చాలా కాలంగా వాయిదా పడుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు చివరకు పచ్చజెండా ఊగబోతున్నట్లు కనిపిస్తోంది. వచ్చే వారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తేల్చి చెప్పారు. సెప్టెంబర్ 10 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.
మంత్రి కోమటిరెడ్డి వివరాల ప్రకారం, స్థానిక సంస్థల ఎన్నికలు రెండు విడతల్లో జరిగే అవకాశముంది. తొలి దశలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత రెండో విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు కావాల్సిన సన్నాహాలు ఎన్నికల సంఘం వేగవంతం చేసింది. ప్రస్తుతం అసెంబ్లీలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల బిల్లుపై చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో ఆమోదం తర్వాత మండలిలో కూడా ఆ బిల్లుపై చర్చ జరగనుంది. ఆ తర్వాతే ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈ రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి వారం రోజుల సమయం కోరింది.
Also Read
రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ దిశగా అడుగులు వేస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 10లోపు విడుదల చేయాలని నోటిఫికేషన్ ఇచ్చింది. సెప్టెంబర్ 4 లేదా 5న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. అనంతరం 6 లేదా 7న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై అభ్యంతరాలను స్వీకరిస్తారు. పరిశీలనల అనంతరం 8 లేదా 9న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. దీంతో సెప్టెంబర్ 10నాటికి ఎన్నికల ప్రక్రియ ఘనంగా ప్రారంభమవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
గత ఏడాదిన్నరగా రాష్ట్రంలో పాలక మండళ్లు లేకపోవడంతో గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ముఖ్యంగా 15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులు విడుదల కాకపోవడంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయి. ఈ నిధులను తిరిగి పొందేందుకు కూడా ఎన్నికలు కీలకమని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణ హైకోర్టు కూడా సెప్టెంబర్ 30లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Nani : అది తలచుకుంటే నరకంలా అనిపిస్తోంది.. నాని షాకింగ్ కామెంట్స్
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!