Local body Elections : రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం పర్వం సోమవారం సాయంత్రంతో ముగిసింది. ఈ విడత పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 17న (బుధవారం) 182 మండలాలు, 4157 గ్రామ పంచాయతీలలో పోలింగ్ జరగనుంది. తుది విడతలో 53 లక్షల 6 వేల 401 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 26 లక్షల 1861 మంది పురుష ఓటర్లు, 27 లక్షల 4…
తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగయగా.. ఒంటి గంట లోపు క్యూలైన్లో ఉన్న వారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్టు ఎన్నికల అధికారుల అంచనా వేస్తున్నారు. పూర్తి స్తాయి పోలింగ్ శాతం రావడానికి మరింత సమయం పట్టనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. పోలింగ్ ముగియగానే బ్యాలెట్ బాక్సులను ఎన్నికల అధికారులు సీజ్ చేశారు.…
అసెంబ్లీ ఎన్నికలైనా.. మున్సిపల్ ఎన్నికలైనా.. గ్రామపంచాయతీ ఎన్నికలైనా.. ప్రలోభాల పర్వం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు అడ్డగోలుగా నగదు, మద్యం పంపిణీ చేస్తారు. ఏరియాను బట్టి ఓటుకు రూ.2-5 వేల వరకు కూడా ముట్టజెబుతారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో ఇదే జరుగుతోంది. అయితే గెలుపు కోసం కొందరు అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులనే ఎరగా వేస్తున్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓ ఊహించని విషయం మెదక్…
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగరంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి దామల నాగరాజు మృతి చెందారు. నామినేషన్ వేసిన అనంతరం నాగరాజు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. డాక్టర్లు బ్రెయిన్ డెడ్‌తో మృతి చెందాడని నిర్దారించడంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తరలించారు. నాగరాజుకు ఎన్నికల్లో ఉంగరం గుర్తును కేటాయించారు. ఎన్నికల రోజే ఇండిపెండెంట్ అభ్యర్థి మృతి చెందడంతో గ్రామంలో విషాద…
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. సర్పంచ్ అభ్యర్థి పదవులు గెలవడం కోసం పలువురు అడ్డదారులు తొక్కుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే మద్యం, డబ్బులు పంపిణీ చేసి గెలవాలని పలుచోట్ల అభ్యర్థులు ప్రయత్నాలు చేశారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో గెలవడం అభ్యర్థులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఏకంగా క్షుద్ర పూజలు కూడా చేస్తున్నారు. నేడు రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో క్షుద్ర పూజల కలకలం రేపింది. Also…
Local Body Elections : తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. గురువారం జరగనున్న తొలి విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరగేలా విస్తృత చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తొలి విడతలో మొత్తం 189 మండలాలు, 4,236 గ్రామపంచాయతీలు, 37,440 వార్డులు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఉన్నాయి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 37,562 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు…
Local Body Elections : రాష్ట్రంలో గ్రామ పాలనకు సంబంధించి నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల తొలి విడత ప్రచారం సోమవారంతో ముగిసింది. ఎన్నికల ప్రచారం ముగియడంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. తొలి విడత పోలింగ్ ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరగనుంది. ఈ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 189 మండలాల్లోని 4,235 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది.…
Local Body Elections : తెలంగాణలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో, బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేశారు. మొత్తం 4,236 గ్రామాలకు నోటిఫికేషన్ ఇవ్వగా, 22,330 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరణలు, బుజ్జగింపుల తరువాత 395 గ్రామాలు ఏకగ్రీవం అయినట్టుగా అధికారులు ప్రకటించారు. వీటిలో వికారాబాద్ జిల్లా 39 గ్రామాలతో అత్యధిక ఏకగ్రీవాలు నమోదు చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో 33…
గ్రామాలలో గ్రామపంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో తమ ఓటు అమ్మబడదు అంటూ గ్రామంలోని కొందరు యువకులు ఇంటి ఎదుట వినూత్నంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ లో గ్రామపంచాయతీ ఎన్నికల వేళ గ్రామంలోని యువత వారి ఇంటికి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు. ఫ్లెక్సీ పై ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, ఆ ఓటుని మేము అమ్ముకోమని, మా ఓటు విలువైనది – అమ్మబడదు అని…
Local Body Elections : తెలంగాణలో గ్రామ పంచాయతీలకు ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేస్తూ ఎన్నికల ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల పరిధిలో 564 మండలాలకు చెందిన 12,728 గ్రామ పంచాయతీలు, 1,12,242 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మూడు దఫాల్లో ఓటింగ్ జరుగనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుమిదిని ప్రకటించారు. మొదటి దఫా – డిసెంబర్ 11 పోలింగ్ కవరేజ్: 189 మండలాలు –…