Nani : నేచురల్ స్టార్ నాని మరోసారి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. జగపతిబాబు పోస్ట్ గా చేస్తున్న జయంబు నిశ్చయంబురా షోకు నాని గెస్ట్ గా వచ్చాడు. ఇందులో అనేక విషయాలను పంచుకున్నారు. గతంలో నాని తనకు నచ్చిన సినిమాకు జాతీయ అవార్డు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని తాజాగా జగపతిబాబు గుర్తు చేయగా నాని రియాక్ట్ అయ్యాడు. ఒకప్పుడు మంచి విషయాన్ని మంచి అని చెడు విషయాన్ని చెడు అని చెప్పడానికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఏం మాట్లాడినా, ఎలాంటి పోస్ట్ పెట్టిన దాన్ని చుట్టూ నెగెటివిటీ ఉంటుంది.
Read Also : Mahesh Babu : ఇలా జరుగుతుందని అనుకోలేదు.. మహేశ్ బాబు ఎమోషనల్
ఒక పోస్ట్ పెట్టామంటే అది మంచిదైనా ట్రోల్స్ చేస్తున్నారు. ఒక పోస్ట్ పెట్టేముందు నెగెటివ్ కామెంట్స్ ను తలచుకుంటే నరకంలా అనిపిస్తోంది. ఒక విషయంపై మనం స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నాం. ప్రతి ఒక్కరికి మనం చేసే పని గురించి వివరణ ఇచ్చుకోలేం కదా. అనుకునే వాళ్ళు ఎలాగైనా అనుకుంటారు అని చెప్పుకొచ్చాడు నాని. ఇండస్ట్రీలో అసూయ గురించి జగపతిబాబు అడగ్గా.. నా సినిమా రిలీజ్ అయ్యే రోజు ఎవరి సినిమా ఉన్నా సరే అది బాగా ఆడాలని కోరుకుంటున్నా. ఇండస్ట్రీలో చాలామంది అలా అనుకోరు. అది వాళ్ళ విజ్ఞత. నేను మాత్రం అందరూ బాగుంటేనే మనం బాగుంటాం అని కోరుకునే వాడిని అని తెలిపాడు నాని.
Read Also : Anushka : అనుష్క వాళ్లకు భయపడి బయటకు రావట్లేదా..?