TS Heavy Rain: గత రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ అస్తవ్యస్తంగా మారాయి. కాళేశ్వరం సమీపంలో గోదావరి, ప్రాణహిత నదులు ప్రవహిస్తున్నాయి. ఈ రెండు నదులు పుష్కరఘాట్ వద్ద 9.770 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంతోపాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద పోటెత్తింది. ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా భద్రాచలం వద్దకు గోదావరి నుంచి 8 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. వర్షానికి తోడు గోదావరి వరద ఎగపోటు కారణంగా వెంకటాపురం మండలంలోని బల్లకట్టు, కంకలవాగు, జిన్నెలవాగు, పూసువాగు, పెంకవాగులు ప్రమాదకరంగా మారాయి. పలు గ్రామాలకు ప్రవాహాలు అడ్డుగా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో వరద నీటిలో రాకపోకలు బంద్ అయ్యాయి. గోదావరి వరదపోటుతో రహదారులపై వరదనీరు చేరింది. పేరూరు-చండ్రుపట్ల గ్రామాల మధ్యనున్న రహదారిని మరిమాగువాగు ముంచెత్తింది. వంతెనపై వరదనీరు చేరడంతో టేకులగూడెం, పెదగంగారం, చండ్రుపట్ల, కృష్ణాపురం గ్రామాలకు పేరూరుతో సంబంధాలు తెగిపోయాయి. ఏడ్జర్లపల్లి-బొమ్మనపల్లి గ్రామాల మధ్య ఒర్రెలో వరదనీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
నేడు మధ్యస్థ నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జిల్లాల వారీగా గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు..
* జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సరాసరి 32.5 మి.మి
* మహబూబాబాద్ జిల్లాలో సగటున 60.1 మి.మి
* వరంగల్ జిల్లాలో సగటున 73.2 మి.మి. వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.
* హనుమకొండ జిల్లాలో సగటున 29 మి.మి
* జనగామ జిల్లాలో సగటున 91 మి.మి, *జనగామ జిల్లాలోని జాఫర్ ఘడ్ వద్ద 186.3 మి.మి వర్షపాతం నమోదైంది.
* ములుగు జిల్లాలో 43 మి.మి సగటు వర్షపాతం నమోదు. ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్.
* భూపాలపల్లి జిల్లాకి నేడు రెడ్ అలెర్ట్.
* ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో 117. మీమీ వర్షపాతం నమోదు.
* కొమురం భీం జిల్లా కౌటాల 96 మీమీ
* నిర్మల్ జిల్లా కుభీర్ లో 81.5 మీమీ
* మంచిర్యాల జిల్లా కొమ్మెర లో 43.3 మీమీ వర్షపాతం నమోదు.
* కడెం ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల.
* స్వర్ణ ప్రాజెక్ట్ ఒక్క గేటు ఎత్తి వేత.
* నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు క్రమంగా పెరుగుతున్న వరద ప్రవాహం
* సిద్దిపేట జిల్లాలో ఉదృతంగా ప్రవహిస్తున్న కూడవెళ్లి, మోహితుమ్మెద, చిట్యాల వాగులతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్
* సంగారెడ్డి జిల్లాలో ఉన్న సింగూరు, మంజీరా, నల్లవాగు, నారింజ ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద
* ఉమ్మడి మెదక్ జిల్లాలో నిండుకుండలను తలపిస్తున్న ప్రాజెక్టులు, వాగులు, వంకలు చెరువులు. మెదక్ జిల్లాలో వన దుర్గ భవాని ప్రాజెక్టు నిండి మంజీరా నది పరవళ్లు తొక్కుతుంది. ఏడు పాయల అమ్మవారి ఆలయం ఎదుట మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తూ పరవళ్లు తొక్కుతుంది.
* రంగారెడ్డి జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఈసీ మూసి వాగులు నిండుకుండలా ప్రవహిస్తున్నాయి హిమాయత్ సాగర్ గండిపేట్ కు భారీగా నీరు చేరుతున్నాయి.
Read also: Tomato: నా టమాటాలు పోయాయి సార్.. పూణెలో పోలీస్ స్టేషన్లో మొదటి కంప్లైంట్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా సింగరేణి కేటీకే 2,3 ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి. 20.వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడగా రూ5. కోట్ల ఆస్తి నష్టం వాటిల్ల నున్నట్టు అంచనా వేశారు సింగరేణి అధికారులు. గణపురం మండలంలో గత నాలుగు రోజులుగా ఎడితెరపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా మోరంచ వాగు ఉదృతంగా ప్రవహిస్తున్నాడంతో మోరంచ వాగవతలి గ్రామాలు అప్పయ్యపల్లి, సీతారంపురం, కొండాపురం, బంగ్లాపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Uttar Pradesh: రెండేళ్లుగా అత్యాచారం.. బిడ్డను చంపేస్తేనే పెళ్లి చేసుకుంటానన్న నీచుడు