CM Revanth Reddy: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేడు వరంగల్, హుస్నాబాద్ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలు, పంట నష్టం వాటిల్లిన ప్రాంతాలను సీఎం పరిశీలిస్తారు. గురువారం ఉదయమే వరద ప్రభావిత జిల్లాలకు వెళ్లేందుకు రేవంత్ రెడ్డి సిద్ధపడ్డారు. ఆఖరి నిమిషంలో సీఎం పర్యటన రద్దయింది. వాతావరణం అనుకూలించకపోవటంతో హెలికాప్టర్ ప్రయాణం వీలు కాదని ఏరియల్ సర్వేకు అధికారులు అనుమతించలేదు. ఈరోజు వాతావరణం అనుకూలించకపోవటంతో తాను రాలేకపోయానని, శుక్రవారం వరంగల్,…
మొంథా తుపాను ఏపీ, తెలంగాణని వణికించింది. ఈదురుగాలులతో కుండపోత వర్షం కుమ్మేస్తోంది. గంటకు 93 కి.మీ. వేగంతో వీస్తున్నాయి. భీకర గాలులకు చరెల్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, నదులకు వరద నీరు పోటెత్తింది.
Montha Cyclone: తెలంగాణకు అతి సమీపంలో మొంథా తుఫాన్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.. ఉత్తర వాయువ్య దిశగా తెలంగాణ వైపు తుఫాన్ కదులుతుందని వెల్లడించింది.. మధ్యాహ్నంలోపు ఉమ్మడి ఖమ్మం జిల్లాను తాకనుంది మొంథా.. రాబోయే 6-12 గంటల్లో వాయుగుండంగా లేదా తీవ్ర వాయుగుండంగా మారనుంది. వాయుగుండంగా మారుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం పడుతుంది..
Telangana Reservoirs: తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రధాన జలాశయాలకు ఎగువ ప్రాంతాల వర్షాల కారణంగా భారీగా నీరు చేరుతున్నాయి. అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నదీ తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద మహారాష్ట్రలోని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో గోదావరి నదిలోకి భారీ వరద నీరు వచ్చి చేరింది. దీనితో అధికారులు 40 గేట్లు ఎత్తారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. ఇక నేడు రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నేడు తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, నిర్మల్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ…