Tomato: రైతులకు ఉల్లి, టమాటా సాగు అధిక రిస్క్‌తో కూడుకున్న పని. ఎందుకంటే ఈ పంటల సరఫరా విషయంలో ఎప్పుడూ అనిశ్చితి ఉంటుంది. ఈ పంట సాగుకు అయ్యే ఖర్చుకు, కోతకు వచ్చే ఖర్చుకు వ్యత్యాసం చాలా ఉంటుంది. దీంతో ఈ సరుకులను మార్కెట్ కమిటీకి తీసుకెళ్లకుండా రైతులు పలుమార్లు ఉల్లి, టమాటాలను రోడ్డుపై పడేసిన రోజులు ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం రైతుల పంట పండింది. టమాటాల ధర మోతమోగింది. ఈ పంట ద్వారా రైతులు చాలామంది కోటీశ్వరులయ్యారు. దీంతో ఈ పంటపై దొంగల కళ్లు పడ్డాయి. పూణె జిల్లాలో 400 కిలోల టమాటాలు చోరీకి గురైన ఘటన చోటుచేసుకుంది.
Read Also:Virat Kohli Unique Record: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలో ‘ఒకే ఒక్కడు’!
శిరూర్ తాలూకా పింపర్‌ఖేడ్ గ్రామానికి చెందిన అరుణ్ బాలు ధోమే అనే రైతు రెండెకరాల పొలంలో టమాటా వేశాడు. సోమవారం జూలై 17 అతను మార్కెట్‌లో విక్రయించడానికి టమాటాలను కోసాడు. ఉదయం మార్కెట్ వద్దకు వెళ్లి టమాటా విక్రయించేందుకు 400 కిలోల టమాటాలను ఆటోలో ఉంచాడు. వస్తువులు 20ట్రేలలో ఉన్నాయి. పడుకునే ముందు మళ్లీ ఆటోలో టమాటాలు ఉన్నాయా అని చెక్ చేసుకున్నాడు. అనంతరం మంగళవారం మార్కెట్‌కు టమాటాలు తీసుకెళ్దామని లేచి చూసే సరికి ఆటోలో టమాటాలు లేవు. అతను, తన కుటుంబ సభ్యులు టమాటాల కోసం చాలా చోట్ల వెతికారు. కానీ వాటి ఆచూకీ లభించలేదు.
Read Also:America: విద్యార్థినిపై పిడుగుపాటు.. అమెరికాలో ఘటన
ధోమ్ కుటుంబీకులు అన్ని చోట్ల వెతికినా టమోటాలు దొరకలేదు. దీంతో ఆయన శిరూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రూ.20 వేల విలువైన 400 కిలోల టమాటాలు చోరీకి గురైనట్లు కేసు నమోదు చేశారు. ఇప్పుడు శిరూర్ పోలీసులు ఆ టమాటా దొంగను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో ప్రస్తుతం టమాట దొంగతనం హాట్ టాపిక్ గా మారింది. పెరిగిన టమోటా ధరపై నటుడు సునీల్ శెట్టి ప్రకటన చేశారు. టమాటా ధర పెరగడం వల్ల తన వంటింట్లో టమాటా వినియోగం తగ్గిపోయిందన్నారు. ఆయన ప్రకటనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత సునీల్ శెట్టి క్షమాపణలు చెప్పాడు. సునీల్ శెట్టి తన ప్రకటనను వక్రీకరించారని, రైతులకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.