Health Director G.Srinivas Rao: ప్రజలు మాస్కులు ధరించడం ఆపొద్దు.. ఎందుకంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రంపంచ దేశాలన్నింటిని వణికించిన కరోనా మహమ్మారి కథ ఇక ముగిసినట్లేనని తెలంగాణ వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. కొత్త వేరియంట్లు వస్తే తప్ప కరోనాను పట్టించుకోనవసరం లేదన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం సీజనల్ వ్యాధుల తీవ్రత పెరిగిందని.. ఇప్పుడు వాటితోనే పోరాడాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో టైఫాయిడ్తో పాటు మలేరియా, డెంగీ తదితర కేసులు పెరుగుతున్నాయని.. వాటిపై వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని తెలిపారు. అయితే.. కరోనా చివరి దశకు చేరుకుందని, ఇకపై ఆ వైరస్ సాధారణ జ్వరం, జలుబు మాదిరిగానే ఉండనుందని స్పష్టం చేశారు.
ఈనేపథ్యంలో.. కరోనా ఓ సీజనల్ వ్యాధిగా మారిపోయిందని, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో 5వేలకు పైగా కరోనా యాక్టివ్ కేసులున్నా మరణాల సంఖ్య జీరోగా ఉందని, అలాగని ప్రజలు మాస్కులు ధరించడం ఆపొద్దని, దానిద్వారా క్షయ, జలుబు, ఫ్లూ తదితర అంటువ్యాధుల నుంచి రక్షణ పొందాలని అన్నారు. అంతేకాకుండా.. కోవిడ్ సోకినవారు 5రోజులు ఐసోలేషన్లో ఉంటే సరిపోతుందని, లక్షణాలు ఎక్కువగా ఉంటే మాత్రం వెంటనే ఆస్పత్రిలో చేరాలని శ్రీనివాసరావు సూచించారు. కొద్ది మందికి కొవిడ్ తో సన్నిహితంగా మెలిగిన వారికి నిర్ధారణ పరీక్షలు అవసరం లేదని, ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొందని వెల్లడించారు. అయితే.. బాధితులు ప్రైవేటు ఆసుపత్రులపై ఫిర్యాదులుంటే ఫోన్ నెంబర్ 91541 70960కు చేయాలని సూచించారు.
Also Read
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
- Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
TS-EAMCET 2022: షెడ్యూల్ ప్రకారమే ఎంసెట్.. ఎలాంటి మార్పు లేదు..
తాజావార్తలు
-
6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్ అందుబాటులోకి..
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?