ప్రతిపక్షాలు అనవసరంగా ఏఎన్ఎమ్ లను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావు మండిపడ్డారు. NHM కింద ఉన్న 2nd ఏఎన్ఎమ్ ల సమస్యలను అర్థం చేసుకొని మాట్లాడాలని కోరాము.. 5వేల 1వంద మంది సెకండ్ ఏఎన్ఎమ్ లు తెలంగాణలో వివిధ సేవలు అందిస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ స్టేట్ డైరక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గడల శ్రీనివాసరావు తన మాటలతో ఫోకస్ అవుతుంటారు. తాను తాయెత్తు మూలంగానే బ్రతికి బయటపడ్డానని చెప్పి వార్తల్లో నిలిచారు. ప్రార్థనల మూలంగానే కొవిడ్ నుంచి బయట పడ్డామని చెప్పి వార్తల్లో నిలిచారు.
ప్రంపంచ దేశాలన్నింటిని వణికించిన కరోనా మహమ్మారి కథ ఇక ముగిసినట్లేనని తెలంగాణ వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. కొత్త వేరియంట్లు వస్తే తప్ప కరోనాను పట్టించుకోనవసరం లేదన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం సీజనల్ వ్యాధుల తీవ్రత పెరిగిందని.. ఇప్పుడు వాటితోనే పోరాడాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో టైఫాయిడ్‌తో పాటు మలేరియా, డెంగీ తదితర కేసులు పెరుగుతున్నాయని.. వాటిపై వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని తెలిపారు. అయితే.. కరోనా చివరి దశకు చేరుకుందని, ఇకపై ఆ…
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా ఏడు వేలకుపైగా నమోదవుతుండగా, నేడు ఆ సంఖ్య 8 వేలు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 8,329 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో దేశం మొత్తం కేసులు 4,32,13,435కు చేరాయి. ఇందులో 4,26,48,308 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,757 మంది మరణించగా, మరో 40,370 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక కొత్తగా 10 మంది మరణించగా, 4,216 మంది వైరస్‌నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని…
తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే వుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కరోనా కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం అవుతోంది. కూకట్ పల్లి, బాలానగర్ లలో రోజు రోజుకు పెరుగుతున్నాయి కోవిడ్ కేసులు. యూపీహెచ్‌సీ,పీహెచ్‌సీలలో 286 పాజిటివ్ కేసుల నిర్దారణ అయ్యాయి. కూకట్ పల్లి- 50,హస్మత్ పేట్ – 20, బాలానగర్ – 51, మూసాపేట – 34, జగద్గిరి గుట్ట – 55, ఎలమ్మబండ – 46, పర్వత్ నగర్ లో 30 కేసులు వెలుగు చూశాయి.…
రాష్ట్రంలో విధిలేని పరిస్థితుల్లో లాక్ డౌన్ పెట్టాల్సి వచ్చింది. అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ చేస్తున్నారు. అయితే మన రాష్ట్రంలో 45 శాతం మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పేషేంట్లు ఉన్నారు అని Dh శ్రీనివాస్ రావు అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అంబులెన్సుల్లో వస్తున్న వాళ్ళు హై ఇన్ఫెక్షన్ లో ఉన్నారు. ఇక్కడ బెడ్ లేక.. చాలా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. సీఎస్ ముందే అన్ని రాష్ట్రాల సీఎస్ లకు లేఖ రాశారు..…