ప్రంపంచ దేశాలన్నింటిని వణికించిన కరోనా మహమ్మారి కథ ఇక ముగిసినట్లేనని తెలంగాణ వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. కొత్త వేరియంట్లు వస్తే తప్ప కరోనాను పట్టించుకోనవసరం లేదన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం సీజనల్ వ్యాధుల తీవ్రత పెరిగిందని.. ఇప్పుడు వాటితోనే పోరాడాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో టైఫాయిడ్‌తో పాటు మలేరియా, డెంగీ తదితర కేసులు పెరుగుతున్నాయని.. వాటిపై వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని తెలిపారు. అయితే.. కరోనా చివరి దశకు చేరుకుందని, ఇకపై ఆ…