ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడో వన్డే మ్యాచ్‌కు దూరమయ్యాడు. కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆయన కుడి కాలు కండరాలు లాగడంతో ఇబ్బంది పడ్డారు. 33వ ఓవర్లో పరుగులు తీస్తున్న క్రమంలో ఈ గాయం కాగా, ఫిజియో చికిత్స అందించిన తర్వాత కూడా ఆయన ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఆ తర్వాతి బంతికే సాకిబ్ మహమూద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు. గాయం తీవ్రత కారణంగా సుందర్ రెండో ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేయడానికి గానీ, బౌలింగ్ చేయడానికి గానీ మైదానంలోకి రాలేదు.
ఆయన స్థానంలో ప్రిన్స్ యాదవ్ ఫీల్డింగ్ చేశారు. సుందర్ దూరం కావడంతో భారత్ కేవలం ఐదుగురు బౌలర్లపైనే ఆధారపడాల్సి వచ్చింది. దీనివల్ల జట్టు వ్యూహాలు మార్చుకోవాల్సి వచ్చిందని, బౌలింగ్ మార్పులలో ఇబ్బంది కలిగి మొమెంటం దెబ్బతిందని మ్యాచ్ అనంతరం శుభ్‌మన్ గిల్ అభిప్రాయపడ్డారు.
Also Read
- SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
- SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
- Off The Record: ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే.. వయా ఎంపీ..!
- Off The Record: జీహెచ్ఎంసీలో ముద్ర కోసం ప్రభుత్వ ప్రయత్నాలు.. కార్పొరేషన్స్ ఎన్నికలపై దృష్టి.!
ఈ రెండో వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రస్తుతం 1-1 తో సమమైంది. అంతకుముందు జరిగిన మొదటి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు సిరీస్ విజేతను నిర్ణయించే లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగే మూడో వన్డే మ్యాచ్‌కు సుందర్ అందుబాటులో ఉండటం లేదు. ఇప్పటికే ఈ సిరీస్ ప్రారంభానికి ముందే హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి కూడా గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. నితీష్ రెడ్డికి క్వాడ్రిసెప్స్ సమస్య, హర్షిత్ రాణాకు గ్రేడ్ 1 హ్యామ్‌స్ట్రింగ్ గాయం అయినట్లు స్కాన్లలో తేలింది. ఈ కీలక ఆటగాళ్ల గైర్హాజరీ భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!