Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు తనతో మాట్లాడటం లేదని మనస్తాపం చెంది, ఓ మైనర్ బాలిక ప్రియుడికి వీడియో కాల్ చేసి ఆత్మహత్యకు చేసుకుంటున్నాను అంటూ చెప్పి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కూకట్పల్లి మూసాపేట్ గురువారం చోటుచేసుకుంది.
పోలీసులు, మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన త్రిలోచన్ సాహు, నిర్మల సాహూ గత కొన్ని సంవత్సరాల క్రితం మూసాపేట్ జనతా నగర్ కు వచ్చి నివాసం ఉంటున్నారు. త్రిలోచన్ కుమార్తె సమీపంలోని స్థానికంగా ఉన్న ఎస్ఎం మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుకుంటుంది. అదే పాఠశాలలో పార్ట్ టైం టీచర్ గా పనిచేస్తున్న నరేష్ తో సాన్నిహిత్యం ఏర్పడి, సామాజిక మాధ్యమల ద్వారా చాటింగ్ చేసుకుంటున్నట్టు విషయం తెలిసిన తల్లిదండ్రులు అమ్మాయిని మందలించారు.
Also Read
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
- Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
మరోవైపు నరేష్ కు మరోసారి అమ్మాయితో మాట్లాడవద్దని వార్నింగ్ ఇచ్చారు. అప్పటినుండి నరేష్ ఆ బాలికను దూరం పెట్టడం ప్రారంభించాడు. దాంతో మానసికంగా కృంగిపోయిన బాలిక.. నరేష్ మాట్లాడడం లేదంటూ మనస్తాపం చెంది అతడికి వీడియో కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సమాచారం ఇచ్చింది. వెంటనే నరేష్ బాలిక బంధువులకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటానని నాకు వీడియో కాల్ చేసిందని సమాచారం ఇచ్చాడు.
దానితో సమాచారం అందుకున్న బంధువులు అమ్మాయి గదిలోకి వెళ్లి చూడగా అమ్మాయి అప్పటికే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగా నరేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
ట్రెండింగ్
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?