తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 482 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఇద్దరు కరోనా బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 455 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,50,835కు చేరుకోగా… ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 3,833కు పెరిగింది.. ఇక, రికవరీ కేసులు 6,38,865కు చేరుకున్నాయి.. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.16 శాతంగా ఉందని ప్రభుత్వం పేర్కొంది.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 8,137 యాక్టివ్ కేసులు ఉన్నట్టు చెబుతున్నారు. మరోవైపు.. గత 24 గంటల్లో 88,164 శాంపిల్స్ పరీక్షించారు. తాజా కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 82, కరీంనగర్‌లో 61 కేసులు నమోదు అయ్యాయి.