ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్ నేడు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో నిఖత్ జరీన్‌కు తెలంగాణ ప్రభుత్వం తరుఫున ఘన స్వాగతం పలికారు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిఖత్ జరీన్‌కు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది ఆణిముత్యాలు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతో ఈ ఘనత సాధించిందని ఆయన ప్రశంసంచారు. భవిష్యత్ లో కూడా అనేక విజయాలు సాధించాలని కోరుకుంటున్నానన్నారు.
ఒలింపిక్స్‌లో కూడా ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నానని ఆయన వెల్లడించారు. దేశంలో ఎవ్వరు చేయని కృషి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలకు కృషి చేస్తున్నారని, క్రీడలకు, టూరిజం శాఖకు ప్రభుత్వం గుర్తింపు ఇస్తుందని ఆయన తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ కు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటామని, ముఖ్యమంత్రి కేసీఆర్ ను త్వరలో కలుస్తామన్నారు. నిఖత్ జరీన్ తో పాటు ఈషా సింగ్, ఫుట్ బాల్ క్రీడాకారిని సౌమ్యలకు అభినందనలు తెలిపారు.