Nikhat Zareen: భారత బాక్సింగ్ స్టార్, తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ మరోసారి అద్భుత ప్రతిభను కనపరిచింది. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్ 2025లో నిఖత్ 51 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. నవంబర్ 20న జరిగిన ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన జువాన్ యి గువోపై నిఖత్ 5–0 తేడాతో వార్ వన్ సైడ్ లా విజయం సాధించింది. ఈ విజయంతో భారత మహిళల స్వర్ణాల సంఖ్య ఐదుకు చేరింది. నిఖత్‌కు…
Interesting Moment : తెలంగాణ రాజకీయ వేదిక నుంచి కరాటే మ్యాట్‌పైకి.. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేరుగా కరాటే రింగ్‌లో తలపడ్డారు! ఇదేదో యాక్షన్ సినిమా సన్నివేశం కాదు, హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో వాస్తవంగా జరిగిన విశేషం. శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో 4వ కియో నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్ 2025 ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, స్పీకర్ గడ్డం ప్రసాద్,…
పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణంపై గురిపెట్టిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ నిరాశపరిచింది. మహిళల 50 కేజీల విభాగంలో ప్రీక్వార్టర్స్‌లో చైనా బాక్సర్ వు హు చేతిలో 0-5 తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఒలింపిక్స్‌లో నిఖత్ పతక ఆశలు ఆవిరయ్యాయి.
రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ నిఖత్ జరీన్.. ఆదివారం పారిస్ ఒలింపిక్స్‌ను ఘనంగా ప్రారంభించింది. మహిళల 50 కేజీల ఒలింపిక్స్‌లో జర్మనీ క్రీడాకారిణి మ్యాక్సీ కరీనా క్లోట్జర్‌పై విజయం సాధించి జరీన్ ప్రిక్వార్టర్‌ఫైనల్‌లోకి ప్రవేశించింది. నార్త్ ప్యారిస్ ఎరీనాలో జరిగిన చివరి 32 రౌండ్‌లో 28 ఏళ్ల అన్‌సీడెడ్ బాక్సర్ జర్మన్ బాక్సర్‌పై 5-0తో గెలిచింది.
పారిస్ వేదికగా ఒలింపిక్స్-2024 క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఒలింపిక్స్ ఆరంభరోజు భారత్‌కు చెందిన అథ్లెట్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. యువ షూటర్ మనుబాకర్ మాత్రం అదరగొట్టింది. 2020 ఒలింపిక్స్‌లో మూడు విభాగాల్లో పోటీ పడి ఈవెంట్‌లోనూ ఫైనల్ చేరకుండా నిరాశపరిచిన మనుబాకర్.. ఈ సారి అంచనాలను అందుకుంటూ పోటీ పడ్డ తొలి ఈవెంట్‌లోనే ఫైనల్ చేరి పతకం మీద ఆశలు రేపింది.
భారత బాక్సర్ నిఖత్ జరీన్ సెమీ ఫైనల్లో ఓడిపోయింది. బాక్సింగ్‌లో స్వర్ణ పతకం సాధించాలన్న భారత్ ఆశలు ఆవిరయ్యాయి. 50 కేజీల విభాగంలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో నిఖత్ జరీన్ థాయ్‌లాండ్ బాక్సర్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత వెటరన్ నిఖత్ జరీన్ 2-3 తేడాతో ఓటమి పాలైంది.
ఆసియా క్రీడలు 2023లో భారత అథ్లెట్ల హవా కొనసాగుతోంది. తాజాగా.. భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మహిళల 45 నుంచి 50 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. దీంతో మరో పతకం ఖాయమైంది. జోర్డాన్ క్రీడాకారిణి హనన్ నాసర్‌తో జరిగిన క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లో నిఖత్ జరీన్ ఏకపక్షంగా ఆడింది. ఈ విజయంతో నిఖత్.. 2024లో పారిస్‌లో జరిగే ఒలింపిక్ క్రీడల కోటాను దక్కించుకుంది.
టీవల జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించింది. ఈ క్రమంలో ఆమె తొలిసారిగా హైదరాబాద్ వచ్చింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్.