Puvvada Ajay Kumar: కాంగ్రెస్ కు పవర్ ఇస్తే రైతులకు కరెంట్ కట్ అంటూ పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం మండలం మంచుకొండలో ధర్నాలో మంత్రి అజయ్ కుమార్ పాల్గొన్నారు. మూడు గంటల విద్యుత్ సరిపోతుంది అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పై అజయ్ కుమార్ నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ నికు వ్యవసాయం గురించి ఏమి తెలుసు? అని ప్రశ్నించారు. గోడలకు సున్నాలు వేసిన రేవంత్ కు రైతుల బాధలు ఏమి తెలుసు? అని మండిపడ్డారు. వ్యవసాయానికి 24 కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. కాంగ్రెస్ కు పవర్ ఇస్తే రైతులకు కరెంట్ కట్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రాక ముందే వాళ్ళ కడుపులో ఏమి వుందో స్పష్టం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కష్టాలు మనకు తెలుసు..కేసీఆర్ రాగానే ఎడు గంటలు, ఇప్పుడు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని గుర్తు చేశారు. తెలంగాణలోని అద్భుతమైన వ్యవసాయం సాగుతోందని అన్నారు. అప్పుడే రైతుల ముఖం తెల్లగా కనబడుతుందని తెలిపారు.
Read also: Hyderabad Bike Stunt: పోతావ్ ర రేయ్.. గర్ల్‌ప్రెండ్ వెనుక కూర్చుంటే ఇంత పైత్యం అవసరమా?
గతంలో ఎరువుల లారీలు ఎలా లూటీలు అయ్యాయి? అని ప్రశ్నించారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదన్నారు. విత్తనాల కోసం రోడ్లమీద చెప్పులు పెట్టిన పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉండేదని అన్నారు. గతంలో పిండి బస్తాలు విత్తనాల కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డాము మనకు తెలుసని అన్నారు. 24 గంటల కరెంటు రైతు బీమా రైతు బంధు ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వంలో ఇస్తున్నామన్నారు. కేసీఆర్ రైతు బాంధవుడు.. మన పిల్లలు మంచిగా చదువుకుంటున్నారంటే కేసీఆర్ మహిమ అన్నారు. ఏ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు ఇవ్వటం లేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాదు.. రేవంత్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పాతాళంలోకి దిగిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి భూస్థాపితం చేస్తారన్నారు. రైతులు రేవంత్ రెడ్డిని తరిమితరిమి కొడతారని అన్నారు. చంద్రబాబు ఏజెంట్లు ఉత్తర నాయకులు పీసీసీ ప్రెసిడెంట్లుగా వున్నారని ఆరోపించారు. వారికి భవిష్యత్తు లేకుండా చేయాలని, కాంగ్రెస్ పార్టీ కుటిల నీతిని గ్రామాల్లో ఎండగట్టాలని పిలుపు నిచ్చారు.
Secret Camera: గదిలో రహస్యంగా కెమెరాలు.. యువతులు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలు రికార్డ్