Ponnam Prabhakar Feeling Sad For Not Giving Him Importance In Party: మనం ఎంతో కష్టపడి పని చేస్తున్నప్పటికీ.. సరైన ప్రోత్సాహకాలు అందకపోతే ఎలా ఉంటుంది? కచ్ఛితంగా అసంతృప్తి చెందుతాం. కష్టానికి తగ్గ ఫలితం దక్కలేదన్న అసహనంలో ఉండిపోతాం. సరిగ్గా ఇదే అసంతృప్తిలో ఉన్నారు కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. తాను ఎంతో కష్టపడుతున్నా, చాలాకాలం నుంచి పార్టీకే కట్టుబడి ఉన్నా.. తనకు పార్టీ సరిగ్గా ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తిలో ఉన్నట్టు తెలిసింది. తన అనుచరుల వద్ద ఆయన తన అసహనాన్ని వెళ్లగక్కినట్టు సమాచారం. ఎలక్షన్ కమిటీలో చోటు దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారట. అలాగే.. కమిటీల్లోనూ సరైన గౌరవం దక్కలేదని నిరాశగా ఉన్నారు.
Extramarital Affair: భర్త ఇంట్లో ఉండగానే.. ప్రియుడ్ని ఇంటికి పిలిపించి..
ఒక మాజీ ఎంపీకి, తెలంగాణ ఉద్యమకారుడికి ఇచ్చే గౌరవం ఇదేనా? అని అనుచరుల వద్ద పొన్నం ప్రభావకర్ ఆవేదన చెందినట్టు తెలిసింది. ఇప్పటికే తనకు కమిటీలో అన్యాయం జరిగిందని.. తెలంగాణ ఇంచార్జ్ మాణిక్‌రావు దృష్టికి తీసుకువెళ్లారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తూ.. పార్టీనే నమ్ముకుని ఉన్న తనకు మాత్రం తీవ్ర అన్యాయం చేశారని ఆయన వద్ద ప్రస్తావించారు. కమిటీలో బీసీలకు తగిన ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ఆవేదన విన్న మాణిక్‌రావు.. ఆయన్ను ఓదార్చి, అధైర్యపడొద్దని సూచించినట్టు తెలుస్తోంది. పార్టీ ఎప్పటికీ నమ్ముకున్న వారికి అన్యాయం చేయదని, తాను హైకమాండ్‌తో మాట్లాడుతానని హామీ ఇచ్చారని సమాచారం.
Crime: కిరాతకం.. సెంట్ కొట్టుకుని బయటకు వెళ్తున్నందుకు భార్యను కాల్చి చంపిన భర్త