పెద్దపల్లి జిల్లా మంథనిలో శ్రీ బిక్షేశ్వర దేవాలయంలో శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలకు మాహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వర్షాలు పడకపోవడం వల్ల ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నారని, రాష్ట్రంలో ఎక్కడ కూడా తాగునీటి సమస్య రాకూడదని ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు.
Read Also: US: యూఎస్ ప్రజలకు బిగ్ అలర్ట్.. తక్షణమే రష్యా విడిచి వెళ్లాలని హెచ్చరిక
బ్యారేజీల విషయంలో తాము సాంకేతిక నిపుణలము కాదని.. సాంకేతిక నిపుణులు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు పరిశీలించిన అనంతరం చేసే సూచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. రాష్ట్ర రైతులకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. అనంతరం గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల కోసం ప్రత్యేకంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అల్పాహార శిబిరంను ప్రారంభించి భక్తులకు వడ్డించారు. అనంతరం మంథని డిపోను సందర్శించి కార్మికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. శివరాత్రి సందర్భంగా వేలాల జాతరకు మంథని డిపో నుండి భక్తుల కోసం ఆర్టీసీ బస్సును ప్రారంభించారు.
Read Also: EC Alert: ఎన్నికల షెడ్యూల్‌పై ఈసీ క్లారిటీ