రష్యాలోని అమెరికా (America) పౌరులకు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే అమెరికా పౌరులందరూ తక్షణమే రష్యాను విడిచి తమ దేశానికి వెళ్లాలని కోరింది. తాజాగా మరోసారి రష్యాలోని అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరులకు తాజాగా మరిన్ని హెచ్చరికలు జారీ చేసింది.
మాస్కో(Moscow)లో ప్రజలు ఎక్కువగా గుమిగూడే పెద్ద సమావేశాలను, కచేరీలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని యూఎస్ ఎంబసీ తెలిపింది. రాబోయే 48 గంటల్లో జరిగే సభలు, సమావేశాలకు ప్రజలు దూరంగా ఉండాలని, తమ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న విషయాలను కనిపెట్టుకొని ఉండాలని రాయబార కార్యాలయం తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
మాస్కోలో దాడి చేయడానికి ఉగ్రమూకలు పొంచి ఉన్నాయని అమెరికా పౌరులు జాగ్రత్తగా ఉండాలని రష్యాలోని యూఎస్ ఎంబసీ హెచ్చరించింది.
ఉక్రెయిన్-రష్యాకు జరుగుతున్న పోరాటంలో ఉక్రెయిన్ తరపున పోరాడటానికి పశ్చిమ దేశాలు సైనికులను పంపితే అణు యుద్ధాన్ని రెచ్చగొట్టే ప్రమాదం ఉందని ఇటీవల పుతిన్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులు మరింత తీవ్రం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గ్రీకు ప్రధాని ఉక్రెయిన్‌లో పర్యటిస్తుండగా కిపణి దాడి జరిగింది. ఈ ప్రమాదం నుంచి ఉక్కెయిన్ అధ్యక్షుడు, గ్రీకు ప్రధాని తృటిలో తప్పించుకున్నారు.