తన రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా సీఏ స్టూడెంట్స్ ను ఉద్దేశించి ప్రసంగించారు. అనేక విషయాలను ప్రస్తావించిన పవన్.. ఈ క్రమంలో ఆయన తన సినీ, రాజకీయ జీవితాన్ని కూడా పంచుకున్నారు.. ఇదే సమయంలో.. తన రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. తానొక ఫెయిల్యూర్ పొలిటీషియన్‌ని అని వ్యాఖ్యానించారు.. అయితే, పవన్ ఆ వ్యాఖ్యలు చేయగానే అక్కడున్న సీఏ స్టూడెంట్స్ ఒక్కసారిగా సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. కానీ, దీనిని నేను అంగీకరించాలని, రాజకీయాల్లో ఫెయిల్ అయినందుకు తానేమీ బాధపడడం లేదన్నారు.. అంతేకాదు, ఫెయిల్యూర్ అనేది సక్సెస్ కి సగం అడుగు దూరంలో ఉంటుందని ఆయన చెప్పడంతో.. విద్యార్థులంతా చప్పట్లతో స్వాగతించారు..
Read Also: Hair Transplant : బట్టతల పోతదనుకుంటే బతుకే లేకుండా పోయింది
సీఏ విద్యార్థుల సమక్షంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.. ఓటమితో తాను మరింత నేర్చుకునే అవకాశం ఉంటుందని, మరింత సాధించే అవకాశం ఉంటుందని కూడా తెలిపారు పవన్ కల్యాణ్.. చాలా మంది సొసైటీలో మార్పు వస్తే బాగుటుంది అనుకుంటారు.. కానీ, కంఫర్టబుల్ ప్లేస్‌లో నుంచి బయటకు రాలేరన్న ఆయన.. తాను మాత్రం అలా ఉండలేనని స్పష్టం చేశారు.. సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు కనీసం ప్రయత్నించానని అన్నారు పవన్… అందుకు తాను ఓటమి గురించి బాధపడడం లేదని పేర్కొన్నారు.. రాజకీయ నాయకుడిగా ఓడిపోయాను.. కానీ, పెద్దగా బాధపడనని… ఈ సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి శాశ్వతం కాదన్నారు జనసేనాని.. పాసింగ్ క్లౌడ్స్ లాంటివని అన్నారు. సక్సెస్ ని, ఫెయిల్యూర్ ని ఎక్కువగా మనసుకు తీసుకోకండి అని సూచించారు.. సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా.. మన స్పందన మాత్రం ఒకేలా ఉండాలి.. అదే నేర్చుకోవాలని అని విద్యార్థులను ఉద్దేశిస్తూ పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ముఖ్యంగా..’ తానొక ఫెయిల్యూర్ పొలిటీషన్‌ని.. ఓటమిని ఒప్పుకోవాలి.. దీనిపై నేను ఏమీ బ్యాడ్‌గా ఫీల్ కావడం లేదు.. ఓటమే.. విజయానికి సగం పునాది” అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నడుస్తోంది. కొందరు పవన్ కల్యాణ్ గొప్పతనాన్ని ప్రస్తావిస్తుంటే.. మరికొందరు ఆయనపై సెటైర్లు వేస్తున్నారు.