Negligence of GHMC: హైదరాబాద్ లో ఉదయం కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి ఉండటంతో సముద్రాన్ని తలపించాయి. ఉదయం 5 గంటల నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానకు రోడ్లపైకి వర్షపునీరు చేరింది. దీంతో వాహనదారుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పలువురు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల మ్యాన్ హోల్ మూత తెరచి ఉంచడంతో నీటి ఎద్దడికి ఓ చిన్నారి బలైంది. ఈ విషాధకరమైన ఘటన సికింద్రాబాద్ లోన కళాసిగూడలో చోటుచేసుకుంది.
Read also: Road Romance : పార్కులకు ఫుల్ స్టాప్ పెట్టారు.. రోడ్డుపై రొమాన్స్ మొదలెట్టారు
సికింద్రాబాద్ లోని కళాసిగూడలో జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యానికి పాప మృతి చెందింది. ఉదయం మౌనిక తన సోదరుడితో కలిసి పాల ప్యాకెట్ తీసుకురావడానికి వచ్చింది. ఇద్దరు వర్షంలో తడుస్తూనే పాలకోసం ఇంటి నుంచి బయలుదేరింది. అయితే కళాసిగూడలో మొత్తం నీరు చేరడంతో చిన్నారులు ఇద్దరు నడుచుకుంటూనే ముందుకు సాగారు. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం కారణంగా నిలిచిన నీటిని తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది మ్యాన్‌హోల్స్‌ను తెరిచి ఉంచారు. మౌనిక తన సోదరుడితో కలిసి నీటిలోనే నడుచుకుంటూ వెళ్లింది. మౌనిక తమ్ముడు వికలాంగుడు.. తమ్ముడు నీటిలో పడిపోయాడు. చిన్నారి మౌనిక తన తమ్ముడిని కాపాడే క్రమంలో డ్రైనేజీలో పడిపోయింది. అయితే అది గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నించిన ఫలితం దక్కలేదు. జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మ్యాన్ హోల్ ను మూసివేశారు. అయితే చిన్నారికోసం DRF సిబ్బంది రంగంలోకి దిగారు. చిన్నారి మౌనిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పార్క్ లైన్ వద్ద పాప మృతదేహాన్ని DRF సిబ్బంది గుర్తించారు. చిన్నారి మౌనిక స్థానిక స్కూల్లో 4వ తరగతి చదువుతుందని గుర్తించారు. మౌనిక మృతదేహం గాంధీ మార్చురీ కి తరలించారు. చిన్నారి మృతి దేహాన్ని చూసి తల్లదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. పాలకోసం వెళ్లి ప్రాణాలే కోల్పోయావా తల్లీ అంటూ కన్నీరుమున్నీరయ్యారు. జీహెచ్ ఎంసీ నిర్లక్ష్యం వల్లే తన చిన్నారి మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాన్ హోల్ మూసి వుంటే చిన్నారి మౌనిక బతికి ఉండేదని రోదించారు. జీహెచ్ ఎంసీ నిర్లక్ష్యానికి పాప బలైందని వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read also: Chhattisgarh Naxal Attack: భర్తతోపాటే నన్ను కాల్చండి.. అమర జవాన్ చితిపై పడుకుని రోదించిన భార్య
ఉదయం 5 గంటల నుంచి హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది గంట వ్యవధిలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. హిమాయత్‌నగర్, శేరిలింగంపల్లిలో అత్యధిక వర్షపాతం నమోదు కాగా.. మల్కాజ్‌గిరి, ముషీరాబాద్, నాంపల్లిలో 6, ఉప్పల్, ఆసిఫ్‌నగర్, బాలానగర్‌లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 3 గంటల పాటు హైదరాబాదగ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరించారు.
Yulu Wynn: రూ.55 వేలకే ఎలక్ట్రిక్ బైక్.. డ్రైవింగ్ లైసెన్స్‌తో పనేలేదు..!