Mayor Vijayalaxmi: తెల్లవారుజామున వర్షం హైదరాబాద్ ప్రజలను పలకరించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి గంటపాటు కుండపోత వర్షం కురిసింది. ఇంకా చాలా చోట్ల చిరు జల్లులు కురుస్తున్నాయి.
హైదరాబాద్ లో ఉదయం కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి ఉండటంతో సముద్రాన్ని తలపించాయి. ఉదయం 5 గంటల నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానకు రోడ్లపైకి వర్షపునీరు చేరింది.