హైదరాబాద్‌ను పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న హైడ్రాను హైకోర్టు అభినందించింది. ప్రజావసరాల కోసం ఉద్దేశించిన స్థలాలు, రహదారులు, పార్కులను కాపాడేందుకు హైడ్రా వంటి సంస్థలు అవసరమని హైకోర్టు పేర్కొంది.
హైదరాబాద్ లో ఉదయం కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి ఉండటంతో సముద్రాన్ని తలపించాయి. ఉదయం 5 గంటల నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానకు రోడ్లపైకి వర్షపునీరు చేరింది.