Road Romance : గతంలో లవర్స్ పార్కులు అడ్డాగా ఉండేవి. ఫ్యామిలీతో పార్కులకు వెళ్లాలంటేనే కష్టంగా అనిపించేది. ఇప్పుడు కాస్త ఆ పరిస్థితి తగ్గింది. కానీ ఇప్పుడు మరో ఇబ్బంది మొదలైంది. పార్కుల్లో పొదల చాటున చేసే రొమాన్స్ కాస్త ఇప్పుడు రోడ్డుకెక్కింది. దీంతో పోలీసులకు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. ఇటీవల కాలంలో పలు ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వీడియో ఒకటి ఛత్తీస్‌గడ్ పోలీసుల దృష్టికి వచ్చింది. బిలాస్‌పూర్‌లో బుధవారం రాత్రి 2 గంటలకు ఈ ప్రేమ జంట నడి రోడ్డుపై అలా రొమాన్స్ చేస్తూ షికార్లు చేసింది. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తూ ఇష్టారీతిన తిరిగారు. ఆ సమయంలో పెట్రోలింగ్ పాయింట్లలో పోలీసులు లేరు. అయితే, ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన తర్వాత పోలీసులు ఫోకస్ పెట్టారు.
" वायरल वीडियो में यातायात नियमों का उल्लंघन करने वालों पर @TrafficBilaspur द्वारा त्वरित कार्यवाही "@SantoshSinghIPS@ChhattisgarhCMO@TrafficBilaspur#BilaspurPolice#trafficbilaspur pic.twitter.com/nl8NZUrJmK
— 𝐁𝐈𝐋𝐀𝐒𝐏𝐔𝐑 𝐏𝐎𝐋𝐈𝐂𝐄 𝐎𝐅𝐅𝐈𝐂𝐈𝐀𝐋 (@PoliceBilaspur) April 27, 2023
ఆ వీడియో ఆధారంగా స్కూటీ నెంబర్ ప్లేట్‌ను కనిపెట్టారు. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా యజమాని వివరాలను సేకరించారు. దాని యజమానికి ఫోన్ చేసి పోలీసు స్టేషన్‌కు రమ్మనట్లు ట్రాఫిక్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సంజయ్ కుమార్ సాహు తెలిపారు. ఆ స్కూటీ ఓనర్ పోలీసు స్టేషన్‌కు వచ్చాడు. అతడిని పై ఘటన గురించి ప్రశ్నించారు. ఆ స్కూటీ తనదేనని వచ్చిన వ్యక్తి అంగీకరించాడు. కానీ, ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి తాను కాదని చెప్పాడు. అది తన మిత్రుడు హర్ష్ తివారీ అని చెప్పాడు. పోలీసులు అప్పుడు అతడికి ఫోన్ చేసి పోలీసు స్టేషన్‌కు పిలిపించారు. 19 ఏళ్ల హర్ష్ తివారీ కవర్దా నివాసి. తిక్రాపారాలో గది అద్దెకు తీసుకుని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లు తెలిసింది. అతడిని అదుపులోకి తీసుకుని మోటార్ వెహికిల్ యాక్ట్ 1988 చట్టం కింద ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘించినందుకు గాను రూ. 8,800 చాలానా వేశారు.
ఇలాంటి ఘటనే కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట ప్రధాన రహదారిపై ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. పబ్లిక్‌గా.. నడిరోడ్డుపై బైక్‌పై రొమాన్స్ చేసుకుంటూ వెళ్లారు. పల్సర్ బైక్‌పై ఆ జంట పరస్పరం ముద్దుల వర్షం గుప్పించుకున్నారు. ఆ ప్రియుడు బైక్ రైడ్ చేస్తూ ఉంటే.. ప్రేయసి బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై ఆయనకు ఎదురుగా కూర్చుంది. ఆమె రెండు కాళ్లను ఆ యువకుడి చుట్టూ పెనవేసుకుని ఎదురుగా కార్లు, బస్సులు, లారీలు వస్తున్నా లెక్క చేయకుండా.. ప్రియుడిపై ముద్దులు కురిపించింది. ప్రియుడు కూడా బైక్ నడుపుతూనే ఆమెను ముద్దాడాడు. చివరకు ఈ వీడియో పోలీసులకూ చేరింది. బైక్‌పై కేసు నమోదు చేసినట్టు చామరాజనగర్ డీఎస్పీ వివరించారు. పోలీసులు సదరు యువకుడిని అరెస్టు చేసినట్టు తెలిసింది. ఆ యువతికి వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టినట్టు సమాచారం.
The #lovers #Romance on running bike, video is quite #Viral .#Chamarajanagar #Traffic police arrested bike rider.
The police released the girl sitting with the young man with a warning.#Karnataka #accident #love #LoversAndFriends pic.twitter.com/WrvYOHn5z4— Dhakad India (@dhakadndia) April 23, 2022