Swimming Pool Death: యువకుడ్ని మింగేసిన స్విమ్మింగ్‌పూల్.. కారణమదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabadi Boy Sampath Died After Diving In Swimming Pool: స్విమ్మింగ్‌పూల్‌లో డైవ్ చేసి, ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ఘాతుకం చోటు చేసుకున్నట్టు తేలింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఫతేనగర్ ప్రాంతానికి చెందిన సంపత్ అనే యువకుడు, తన స్నేహితులతో కలిసి బోయిన్‌పల్లిలోని తెలంగాణ క్లబ్‌లో స్విమ్మింగ్ చేయడానికి వెళ్లారు. అయితే.. వీళ్లందరు మద్యం సేవించి ఉన్నారు. ఈ పూల్‌కి రావడానికి ముందు పార్టీ చేసుకున్న ఆ స్నేహితులు.. పూటుగా మద్యం సేవించారు. ఈ విషయాన్ని యాజమాన్యం గమనించకుండా.. వారిని లోపలికి అనుమతించారు. ఇక లోపలికి వెళ్లిన తర్వాత వాళ్లు పూల్‌లో ఆడుకోవడం మొదలుపెట్టారు.
Ponguleti Srinivas: వీడిన మిస్టరీ.. ఆ పార్టీలోకి పొంగులేటి?
Also Read
ఈ నేపథ్యంలోనే స్నేహితులు కలిసి.. డైవ్ చేసే పందెం వేసుకున్నారు. ఈ పోటీల్లో భాగంగానే.. సంపత్ అనే యువకుడు ఆరు ఫీట్ల లోతు వద్ద డైవ్ చేశాడు. అంతే.. ఆ తర్వాత అతడు నీళ్లలోంచి బయటకు రాలేదు. కొంత సమయం వరకు అతడు కనిపించకపోవడంతో.. స్నేహితులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. అప్పుడు సంపత్ స్విమ్మింగ్‌పూల్ అడుగుభాగంలో కనిపించాడు. దాంతో వాళ్లు యాజమాన్యానికి సమాచారం అందించగా.. స్విమ్మింగ్‌పూల్ ట్రైనీలు రంగంలోకి దిగారు. అతడ్ని పూల్ నుంచి బయటకు తీశారు. కానీ, అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకొని, పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Congress: ఇందిరాగాంధీ హత్యను సెలబ్రేట్ చేసుకున్న ఖలిస్తానీవాదులు.. చర్యలకు కాంగ్రెస్ డిమాండ్..
తాజావార్తలు
-
Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!