MLA Raja Singh Comments On BC Corporation New GO Bill: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ కార్పొరేషన్ నుంచి ఒక జీవో వచ్చిందని.. కుల వృత్తుల వారికి రూ.1 లక్ష లోన్ ఇస్తామంటూ బీఆర్ఎస్ ఈ జీవోని తీసుకొచ్చిందని అన్నారు. అయితే.. బీసీలో 41 కేటగిరీలకు మాత్రమే లోన్ ఇస్తామని వారు చెప్పారని తెలిపారు. బీసీలో మొత్తం 130 కేటగిరీలున్నాయని.. మరి వారి పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. మిగిలిన కేటగిరీలో పేదవారు లేరా? అని నిలదీశారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో.. బీఆర్ఎస్ ఎలక్షన్ స్టంట్ చేస్తోందని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ కూడా ఇలాగే చేసేదని గుర్తు చేశారు.
Harish Rao: పక్క రాష్ట్రాలు, దేశాలకు అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది
బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్నట్టు రూ.1 లక్ష ఇస్తారనే గ్యారెంటీ లేదని.. కచ్ఛితంగా లోన్ వంద శాతం ఇవ్వరని.. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అప్పులకుప్పగా మారిపోయిందని రాజాసింగ్ పేర్కొన్నారు. కాంట్రాక్టర్లకు, వర్కర్లకు కూడా డబ్బులు అందని పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. కమిటీ హాళ్లు ఇస్తామని కొందరు తన నియోజకవర్గంలో తిరుగుతున్నారని వెల్లడించారు. బీఆర్ఎస్ వాళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని జీరో చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలారా? లోన్లు ఇస్తామని చెబుతున్న బీఆర్ఎస్ సర్కార్ మాయలో పడకండని సూచించారు. ఇప్పటికే తెలంగాణ అప్పులపాలయ్యిందని చెప్పిన ఆయన.. ఈసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే, తెలంగాణనే అమ్మేస్తారని ఆరోపణలు చేశారు.
Adipurush: కీలక నిర్ణయం.. వారికి ‘ఆదిపురుష్’ టికెట్స్ ఉచితం
బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే.. మీరే నష్టపోతారని రాజాసింగ్ చెప్పుకొచ్చారు. లోన్లు ఇస్తామని కొత్త జీవోని తెరపైకి తీసుకొచ్చారని, ఇది కేవలం షోపుటప్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఒక సామాజిక వర్గానికి రూ.10 లక్షలు అందిస్తున్నారని.. మరి మిగతా వారికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆ రూ.10 లక్షలు కేసీఆర్ తన జేబులో నుంచి ఇవ్వట్లేదని.. ప్రజలు కట్టే పన్నులనే తిరిగి ఇస్తున్నారని అన్నారు. అది పార్టీ ఫండ్ ఏమీ కాదన్నారు. అన్ని సామాజిక వర్గాలకు రూ.5 లక్షల లోన్ ఇవ్వాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.