Minister Harish Rao Speech In Siddhipet Public Meeting: తెలంగాణ రాష్ట్రం.. పక్క రాష్ట్రాలు, దేశాలకు అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. దేశంలో ఎక్కువగా వరి పండిస్తున్న రాష్ట్రం.. తెలంగాణ రాష్ట్రమేనని చెప్పారు. సిద్దిపేటలో నిర్వహించిన సాగునీటి దినోత్సవంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు కోసం ఎన్నో కష్టాలు పడ్డామన్నారు. కరువు పాటలు పాడుకున్న ఈ నేలలో ఇప్పుడు కాళేశ్వరం జలాలు పారుతున్నాయని అన్నారు. దేశంలో భూగర్భ జలాలు పడిపోతుంటే.. తెలంగాణలో ఏడున్నర మీటర్ల భూగర్భ జలాలు పైకి వచ్చాయని చెప్పారు. బతకబోయిన పాలమూరుకు బతకడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వస్తున్నారన్నారు. సిద్దిపేట నుంచి త్వరలోనే తిరుపతికి, బెంగళూరుకి ట్రైన్ సదుపాయం వస్తుందన్నారు. అంతేకాదు.. సిద్దిపేటలో త్వరలోనే ఆర్టిఫిషియల్ బీచ్ కూడా నిర్మిస్తామన్నారు.
TDP and BJP: ఏపీలో మారుతున్న బీజేపీ నేతల స్వరం.. గతంలో విమర్శలు, నేడు కూల్ కామెంట్స్
అంతకుముందు.. మునిపల్లి మండలం చిన్న చల్మెడ శివారులో సంగమేశ్వర ఎత్తిపోతల పంపు హౌజ్ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ చేతుల్లో ఉంటేనే బాగుంటుందని.. వేరే వాళ్ళ చేతికి పోతే ఆగం అవుతుందని అన్నారు. పేదలు, రైతులు సంక్షేమమే ఎజెండాగా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. సంగమేశ్వర పథకానికి భూములిచ్చిన రైతుల్ని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే.. సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం అవుతుందని, రెండేళ్లలో ఈ పథకాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని కోనసీమగా మారుస్తామని మాటిచ్చారు. తెలంగాణ రావడం, కేసీఆర్ సీఎం కావడం వల్లే ఈ ప్రాజెక్టు వచ్చిందన్నారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ఇవ్వడంతో పాటు జహీరాబాద్, నారాయణఖేడ్ ఆసుపత్రులను అభివృద్ధి చేశామన్నారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా అందిస్తున్నామని తెలిపారు.
Adipurush: కీలక నిర్ణయం.. వారికి ‘ఆదిపురుష్’ టికెట్స్ ఉచితం