భారత ప్రభుత్వం 2015 ఆగస్ట్ 7 నాడు జాతీయ చేనేత దినోత్సవంను ప్రకటించింది. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఈ జాతీయ చేనేత దినోత్సవం అని మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వం లో ప్రతి సంవత్సరం చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాం. తెలంగాణ నేతన్నల భారతీయ సంస్కృతి కి వైభవం ను తెచ్చారు. ఈరోజు నుండి ఒక్క వారం రోజుల పాటు జాతీయ స్థాయిలో ఇక్కడ ప్రదర్శన నిర్వహిస్తాం. నేతన్న లు నెచిన వస్త్రాలను ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఈ కామర్స్ ద్వారా ఈ గోల్కొండ అనే వెబ్ సైట్ అనే పోర్టల్ ను ఏర్పాటు చేసి వ్యాపారం చేసేందుకు వీలుంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ చేనేత వస్త్రాలతో ఫ్యాషన్ షో ఏర్పాటు చేస్తున్నాం. కొత్త కొత్త ఆవిష్కరణలు ఇక్కడ చేస్తున్నారు. 2014 కు ముందు ఆనాటి ప్రభుత్వం లో బడ్జెట్ కేటాయింపులు 70 కోట్లు మాత్రమే…తెలంగాణ వచ్చాక 12 వందల కోట్లు కేటాయింపు లు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దక్కుతుంది. మనం చేస్తున్న వినూత్న కార్యక్రమాలు దేశంలోని ఇతర రాష్ట్రాలను ఆకర్షిస్తుంది. చేనేత మిత్ర అనే కార్యక్రమం ద్వారా 50 శాతం సబ్సిడీ ఇస్తున్న ఏకైక రాష్ట్రము తెలంగాణ మాత్రమే.ప్రతి ఒక్కరు చేనేత దుస్తులు దరిద్దాం,చేనేతకు చేయూత నిద్దాం అని పేర్కొన్నారు.