హుజూరాబాద్ సీఎం సభ స్థలిని పరిశీలించారు మంత్రులు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ… దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక అంతా ఒకేసారి జరుగుతుంది. మా జాతి బిడ్డల్లో చిచ్చుపెట్టే కుట్ర జరుగుతోంది. హుజూరాబాద్ కోసమే 2 వేల కోట్లకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది అన్నారు. కాబట్టి ఆందోళన చెందకండి.. అందరికీ దళిత బంధు వస్తుంది. మొదట రైతు బంధు ఇచ్చినప్పుడు కూడా ఇలాగే నిందలు వేశారు. ఇక ఇప్పుడు దళిత బంధు కూడా అందరికీ ఇచ్చి తీరుతాం అని తెలిపారు. ఇలాంటి పథకాల పై కుట్రలు చేయడం దురదృష్టకరం. ఈ నెల 16 మా జాతి ప్రజలకు పండగ అని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.