బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు అసెంబ్లీకి రానున్నారు. 9:30 నిమిషాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని సూచించారు. ప్రతిరోజూ అసెంబ్లీకి తప్పకుండా హాజరుకావాలని సూచించారు. అరగంట ముందుగా 9:30 కే అసెంబ్లీకి రావాలని పిలుపునిచ్చారు. ఈ రోజు తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బీఎల్పీలో సమావేశంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. సమావేశాల్లో మాట్లాడే అంశాలపై పూర్తిగా అధ్యయనం చేసి మాట్లాడాలని సూచించారు.
TS Dalit Bandhu: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో స్పీడ్ పెంచింది. కొత్త పథకాలను ప్రవేశపెట్టడంతోపాటు ఇప్పటికే ఉన్న పథకాలను లబ్ధిదారులకు మరింత చేరువ చేయడమే హ్యాట్రిక్ సక్సెస్ లక్ష్యం.
సీఎం కేసీఆర్ తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు కోసం ప్రభుత్వం కార్యచరణ మొదలుపెట్టింది. నియోజకవర్గానికి వంద కుటుంబాల చొప్పున ఎంపిక చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో దళితబంధు లబ్దిదారుల ఎంపికపై ప్రభుత్వం సమాచోనలు చేస్తోంది. ఈ క్రమంలో లబ్దిదారుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఫైలెట్ ప్రాజెక్ట్ ప్రాంతాల్లో పరిమితి లేకుండా దళితబంధు అమలు చేసేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హుజురాబాద్…
వచ్చే ఎన్నికలలోపు 5 లక్షల మందికి దళిత బంధు అందిస్తామని వెల్లడించారు సీఎం కేసీఆర్… ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం యధాతథంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. దళిత బంధును హుజురాబాద్‌లో సంపూర్ణంగా అమలై తీరుతుందని క్లారిటీ ఇచ్చారు.. దళిత బంధు పథకంపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని… బండి సంజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పథకం అమలు కోసం రూ. 2 వేల కోట్లు విడుదల చేశామని…
దళితబంధు పథకంపై దాఖలైన నాలుగు పిటిషన్లను కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు.. ఎన్నికల కమిషన్ నిర్ణయం విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. హుజురాబాద్‌లో దళితబంధు నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ.. హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి… వాటిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఎన్నికల కమిషన్ విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు రద్దు చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.. ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోమని.. నిష్పక్షపాత ఎన్నికల కోసం తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఈసీకి…
దళిత బంధు ప్రారంభమైనప్పటి నుంచి ఈ పథకంపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్ పార్టీ కి దళిత బంధు స్కీం పెద్ద తలనొప్పిగా మారింది. హుజురాబాద్ ఎన్నికల్లో దళితుల ఓట్లను రాబట్టేందుకు స్కెచ్ వేసిన టీఆర్‌ఎస్ కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ప్రతి పక్షాల అభ్యంతరం నేపథ్యంలో ఈ పథకానికి బ్రేకులు వేసింది ఎన్నికల సంఘం. అయితే.. ఈ పథకంపై అమలుపై మరో ట్విస్ట్ నెలకొంది. దళిత బంధుపై హైకోర్టు ను ఆశ్రయించారు పలువురు…
హుజురాబాద్ నియోజకవర్గానికి దళిత బంధు ఫీవర్ పట్టుకుంది. కొద్ది రోజులుగా లబ్ధిదారులు బ్యాంకుల ముందు బారులుతీరుతున్నారు. పెద్ద ఎత్తున బ్యాంకుకు తరలివస్తుండటంతో కొన్ని సార్లు పరిస్థితి గంధరగోళానికి దారితీస్తోంది. చాలా మంది లబ్ధిదారులు తమ ఖాతాల్లో ఆ మొత్తం జమ అయిందో లేదో తెలుసుకోవలన్న ఆసక్తితో బ్యాంకుకు వెళుతున్నారు. దళితబంధుపథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 23 వేల మంది అర్హులను గుర్తించింది. అయితే ఇప్పటి వరకు 16 వేల ఖాతాలు మాత్రమే తెరిచారు. ఏడు వేల మంది…
దళిత బంధు పథకానికి మద్దతుగా ఇవాళ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు దీక్ష చేపట్టనున్నారు. దళిత బంధు పథకం పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ దీక్ష చేపట్టనున్నారు మోత్కుపల్లి నర్సింహులు. కాసేపట్లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్న మోత్కుపల్లి నర్సింహులు.. 10 గంటల సమయంలో ఆయన నివాసంలో దీక్ష చేయనున్నారు. ఈ దీక్షను ఇవాళ సాయంత్రం 5 గంటలకు వరకు కొనసాగించనున్నారు. కాగా..ఇటీవలే తెలంగాణ సర్కార్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ…
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత, గిరిజన 30 లక్షల కుటుంబాలకు 10 లక్షలు ఇస్తే మేము సహకరిస్తామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. అల.. చేస్తే ఎక్కడ సంతకం పెట్టాలి అంటే అక్కడ పెడతామని రేవంత్ రెడ్డి సవాల్ విసిరాడు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 18 లక్షల ఎకరాల భూ పంపిణీ చేస్తే.. కేసీఆర్ వచ్చిన తర్వాత 2 లక్షల ఎకరాల భూమిని దళితులు, గిరిజనుల నుంచి గుంజుకున్నారని…