కేసీఆర్ నిప్పు.. ముట్టుకుంటే మటాషే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు అధికార టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నాయి. అయితే, గులాబీ పార్టీ నేతలు మాత్రం రెండు పార్టీలపై తీవ్ర విమర్శలు చేస్తూనే వున్నారు. సూర్యాపేట జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన బడుగుల అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులాంటి వ్యక్తి అని, ఆయన ముట్టుకుంటే భస్మం అవుతారని విమర్శించారు మంత్రి జగదీష్ రెడ్డి. కాళేశ్వరం కల సాకారం చేసిన నేత, సంక్షేమం, అభివృద్ధిలో సంచలనాలు సృష్టించిన నాయకుడు అన్నారు. పైరవీలు,దందాలు చేసినోళ్లే ఊర కుక్కల్లా మొరుగుతున్నారు.
Also Read
కేసీఆర్ మీద ,కుటుంబం మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు. 29 రాష్ట్రాలలో అతి చిన్న రాష్ట్రం. సంక్షేమం, అభివృద్ధిలో పరుగులు పెడుతున్న రాష్ట్రం. ముఖ్యమంత్రి కేసీఆర్ లేకుంటే 24 గంటల విద్యుత్ ఉండేదా ? ఇంటింటికి మంచినీరు అందేదా?
దళారులకు దోచి పెట్టడం వారితో అంట కాగడం తప్ప బీజేపీ చేసిందేం లేదన్నారు.గుజరాత్ లో దారిద్ర్య రేఖ మరింత పెరిగింది.
మోడీ పాలనలో దళారులు కుబేరులైనారు.. దేశం దివాళా తీసింది. కాంగ్రెస్ పార్టీకి దిక్కు మొక్కు లేదు. పార్టీని నడిపే నాయకుడు ఎవరో వారికే తెలీదు. సొంత పార్టీకి నాయకుడు ఎవరో వారికే తెలియదు అటువంటి పార్టీలు పేలుతున్న పిచ్చి ప్రేలాపనలను ప్రజలు గమనిస్తున్నారు.మాదంతా పారదర్శకమే. మ్యానిఫెస్టోను ఉన్నది ఉన్నట్లు అమలు పరిచిన ఏకైక పార్టీ టి ఆర్ యస్. ఎక్కడ చర్చకైనా గులాబీ శ్రేణులు సిద్ధమే. డెబ్బయి ఏళ్లుగా జరగని అభివృద్ధి ఏడేళ్లలో 75శాతం పూర్తి అయింది. టి ఆర్ యస్ పార్టీ సంచలనాలకు కేంద్ర బిందువు. అటువంటి పార్టీలో సభ్యత్వం పొందడమే గౌరవం. నిబద్ధతే గుర్తింపు నిస్తుంది.ఆ నిబద్ధత తోటే బడుగులకు పదవులు వచ్చాయన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.
తాజావార్తలు
-
PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
-
Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
-
Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
-
SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా..
-
ICC: కీలక నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. టీ20, వన్డే ప్రపంచకప్ ఫార్మాట్లలో పలు మార్పులు..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!