Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ (KPHB) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడవ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన రెహాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు రెహాన్ బాధితురాలి ఇంటి సమీపంలో పండ్లు విక్రయిస్తూ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఆమెపై కన్నేసిన నిందితుడు.. గత మే నెలలో ఇంట్లో చాక్లెట్లు, బిస్కెట్లు ఉన్నాయని నమ్మించి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బాలికను బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో భయపడిన బాలిక నెలల తరబడి ఈ విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పలేదు.
Also Read
- Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
అయితే ఇటీవల నిందితుడు మరోసారి వేధింపులకు పాల్పడేందుకు ప్రయత్నించడంతో భయాందోళనకు గురైన బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు వెల్లడించింది. వెంటనే వారు కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితుడు రెహాన్‌ను అరెస్ట్ చేశారు. అతనిపై పోక్సో (POCSO) చట్టంతో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!