Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)తో చేతులు కలిపి వినియోగదారుల కోసం ఒక వినూత్న సేవను అందుబాటులోకి తెచ్చింది. దేశంలోనే మొదటిసారిగా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా నిత్యావసర ఎల్పీజీ (LPG) గ్యాస్ సిలిండర్లను ఆర్డర్ చేసిన నిమిషాల్లోనే డెలివరీ చేసే సేవలను బుధవారం ప్రారంభించింది. ప్రస్తుతం తొలి దశలో భాగంగా ఈ సేవలను కర్ణాటక రాజధాని బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్‌గా అందుబాటులోకి తీసుకువచ్చారు. సాధారణంగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి ఉండే నిబంధనల లాగా కాకుండా, ఈ యాప్ ద్వారా ఆర్డర్ చేయడానికి వినియోగదారులకు ముందస్తుగా ఎలాంటి డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు.
ఈ భాగస్వామ్యంలో భాగంగా హెచ్‌పీసీఎల్ తన సరికొత్త 10 కిలోల ‘హెచ్‌పీ నవ్య’ కాంపోజిట్ సిలిండర్లను వాణిజ్యపరంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ సిలిండర్ల ప్రత్యేకత ఏంటంటే, ఇవి పారదర్శకంగా (ట్రాన్స్లూసెంట్) ఉండి, సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో బయటి నుంచే స్పష్టంగా చూసుకోవచ్చు. వీటితో పాటు సాధారణ 5 కిలోల మెటల్ సిలిండర్లు కూడా ఇన్‌స్టామార్ట్ యాప్‌లో లభిస్తాయి. ఇన్‌స్టామార్ట్ కేవలం నిత్యావసర సరుకులకే పరిమితం కాకుండా, గ్యాస్ సిలిండర్ల వంటి అత్యవసర గృహ అవసరాలను కూడా సురక్షితంగా, నమ్మకంగా ప్రజల చెంతకు చేర్చడమే లక్ష్యంగా పెట్టుకుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
Also Read
- Jio Platforms IPO GMP today: జియో ప్లాట్‌ఫామ్స్ IPOకు భారీ స్పందన.. రూ.276 ప్రీమియం.. లిస్టింగ్ ధర ఎంతంటే?
- SBI Cyber Attack: ఎస్బీఐ ఖాతాదారుల డేటా డార్క్ వెబ్‌లో లీక్.. 3,897 మందిపై ప్రభావం!
- Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ నేడు ప్రారంభం.. రూ.30,188 కోట్ల ఇష్యూ, జీఎంపీ, లిస్టింగ్ ధర ఎంత?
- Elon Musk: అమెరికా పిల్లలకు మస్క్ ఫ్రీ ఆఫర్.. స్పేస్ఎక్స్ షేర్లు ఉచితం!
గ్యాస్ సిలిండర్ల రవాణాలో భద్రత అత్యంత కీలకమైన అంశం కాబట్టి, వీటి డెలివరీ బాధ్యతలను స్విగ్గీ సాధారణ డెలివరీ బాయ్స్‌కు కాకుండా, హెచ్‌పీసీఎల్ అధికారిక గుర్తింపు పొందిన పంపిణీదారుల (డిస్ట్రిబ్యూటర్స్) నెట్‌వర్క్‌కు అప్పగించారు. యాప్‌లో వచ్చే ఆర్డర్లను స్థానిక హెచ్‌పీసీఎల్ డిస్ట్రిబ్యూటర్లకు బదిలీ చేస్తారు. వారు తమ శిక్షణ పొందిన సిబ్బంది ద్వారా మాత్రమే వినియోగదారుల ఇళ్లకు సిలిండర్లను సురక్షితంగా చేరవేస్తారు. మొదటిసారి ఆర్డర్ చేసే వినియోగదారులను కొత్త గ్యాస్ కనెక్షన్‌గా పరిగణించి, వారి గుర్తింపు కార్డులను , నివాస ధృవీకరణ పత్రాలను సేకరిస్తారు. ఆ తర్వాత ఆర్డర్ల నుంచి నేరుగా ఖాళీ సిలిండర్ ఇచ్చి, కొత్త సిలిండర్ తీసుకునే ఎక్స్ఛేంజ్ పద్ధతి అందుబాటులో ఉంటుంది. గ్యాస్ రీఫిల్లింగ్ కోసం రోజుల తరబడి వేచి చూసే ఇబ్బంది లేకుండా, అత్యవసర సమయాల్లో నిమిషాల వ్యవధిలోనే గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఈ విధానం ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!