SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అర్హత తేదీగా అక్టోబర్ 1వ తేదీ నాటికి ఓటర్ల వివరాల సవరణను పరిగణనలోకి తీసుకుంటూ నూతన షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నూతన షెడ్యూల్ ప్రకారం బూత్ స్థాయి అధికారులు (BLOs) ఇప్పటికే జూన్ 25 నుంచి ప్రారంభించిన ఇంటింటి సర్వే ప్రక్రియ ఆగస్టు 3 వరకు కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ పనులను సైతం అధికారులు ఆగస్టు 3 నాటికి పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఆగస్టు 10న రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల ముసాయిదా జాబితా (Draft Publication) అధికారికంగా విడుదల కానుంది.
ముసాయిదా జాబితా విడుదలైన అనంతరం, కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు , తప్పుల మార్పులు-చేర్పులకు సంబంధించిన అభ్యంతరాల స్వీకరణకు ఎన్నికల సంఘం నెల రోజుల పాటు గడువునిచ్చింది. ప్రజలు ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు తమ దరఖాస్తులను సమర్పించే అవకాశం కల్పించారు.
Also Read
ప్రజల నుంచి వచ్చే ఈ అభ్యంతరాలు, క్లెయిమ్‌లకు సంబంధించిన నోటీసుల జారీ, వాటి పూర్తి స్థాయి పరిష్కార ప్రక్రియను అధికారులు ఆగస్టు 10 నుంచి అక్టోబర్ 8 వరకు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత అన్ని సవరణలతో కూడిన తుది ఓటర్ల జాబితాను (Final Publication) అక్టోబర్ 12న అధికారికంగా ప్రకటించనున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!