Telangana Govt: తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది అని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 61.45 శాతం యాసంగి వడ్ల కొనుగోళ్లు పూర్తి అయినట్లు పేర్కొనింది. మే 12వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 43.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది అన్నారు.
పౌరసరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 26 జిల్లాల కలెక్టర్లు, సివిల్ సప్లై శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.. ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు కూడా హాజరయ్యారు..
ఇప్పటి వరకూ రాష్ట్రంలో 418.75 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలులో ఇప్పటి వరకూ 391.50 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇప్పటివరకు 24 గంటల్లోపు 281.30 కోట్లు రైతుల ఖాతాలో జమ అయినట్లు తెలిపారు.
అక్టోబర్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 10 జిల్లాల జాయింట్ కలెక్టర్లతో సమావేశం నిర్వహించామన్నారు.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సెక్రటేరియట్‌లో సంబంధిత విభాగాలపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.
2022-23 వానాకాలం ధాన్యం సేకరణపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రి గంగుల కమలాకర్.. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో తెలంగాణలో పంటలు బాగా పండాయన్నారు.. 24 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 1 కోటి 41 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందని.. తెలంగాణ రైతు పండించిన ప్రతీ గింజా కొంటామని స్పష్టం చేశారు.. ఈ సీజన్‌లో 112 లక్షల మెట్రిక్ ధాన్యం కొనుగోలు అంచనా వేశామని.. గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, మాయిశ్చర్ మిషన్లు, ప్యాడీ క్లీనర్లు…
ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లపై ఇవాళ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ధాన్యం సహా పంటల కొనుగోళ్లపై ఆహార పౌరసరఫరాల శాఖ, వ్యవసాయశాఖ అధికారులతో క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్.జగన్ మాట్లాడుతూ.. పంటల కొనుగోళ్లలో ఆర్బీకేలు క్రియాశీల పాత్ర పోషించాలన్నారు. కచ్చితంగా రైతుకు కనీస ఎంఎస్‌పీ ధర లభించాలని… రైతులందరికీ ఎంఎస్‌పీ రావడం అన్నది మన ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ లక్ష్యం దిశగా ఆర్బీకేలు, అధికారులు కృషి చేయాలని…
సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. హింస, ఘర్షణలు ప్రేరేపించే విధంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని.. కల్వకుంట్ల కుటుంబ పాలనపై తెలంగాణ బిడ్డల పౌరుషాన్ని చూపించాలని కోరారు. విష ప్రచారం చేస్తూ రైతులను తప్పుదారి పట్టిస్తున్న టీఆర్ ఎస్ నేతలను ఉరికించాలని… కేసీఆర్ కు కుడివైపు అసదుద్దీన్ ఒవైసీ, ఎడమవైపు అక్బరుద్దీన్ ఓవైసీ పెట్టుకుని మత పర హింస గురించి మాట్లాడుతున్నారని మండి పడ్డారు. ముంబైలో “ఆర్ఆర్ఆర్” ఈవెంట్… మేకర్స్ నిర్ణయంతో…
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ సర్కార్ సరికొత్త రికార్డు సృష్టించింది. ధాన్యం కొనుగోళ్లు గత ఏడాది వానాకాలం రికార్డును దాటాయని… పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. 9 లక్షల మంది రైతుల నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని.. మరో 20 లక్షల మెట్రిక్ టన్నులు కొనే ఛాన్స్ ఉన్నట్లు ఆయన ప్రకటన చేశారు. గత ఏడాది 48.75 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ జరిగినట్లు ఆయన వెల్లడించారు. 14 జిల్లాల్లో…
ధాన్యం సేకరణ, కొనుగోళ్ల పై మంత్రుల బృందంతో సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. కీలక సూచనలు చేశారు.. ధాన్యం సేకరణపై పటిష్ట విధానం ఉండాలని ఆదేశించారు.. ఆర్బీకేల స్థాయిలోనే, ఫాంగేట్ వద్దే కొనుగోళ్ళు జరగాలని.. మోసాలు, అవినీతికి తావులేకుండా అత్యంత పారదర్శక విధానం అమలు చేయాలని.. రైతుకు మంచి ధర వచ్చేలా చూసేందుకే ఈ చర్యలు తీసుకోవాలని సూచించారు.. ఆర్బీకేల స్థాయిలోనే ధాన్యం సేకరణ కేంద్రాలు ఉండాలన్న ఏపీ సీఎం.. పేమెంట్స్‌లో మోసాలు లేకుండా…